పవన్ కళ్యాణ్ కి ఇంత క్రేజ్ రావటానికి కారణాలు ఏమిటో మీకు తెలుసా? నమ్మలేని నిజాలు
ముక్కుసూటితనం,తప్పుని సమర్ధించకపోవడం ఇలా ఎన్నో నిఖార్సైన గుణాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో జనసేన పార్టీనేతగా జనంలోకి దూసుకుపోతున్నారు. చాలామందికి ఈయన వ్యవహారశైలి నచ్చకపోవచ్చు గానీ,ఆయనలోనే ఖచ్చితత్వమే జనంలో ఆయనకు క్రేజ్ తెచ్చిందన్నది నిజం. నిజానికి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు. కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగప్రవేశం చేసి, ఆతర్వాత వ్యక్తిగత ఇమేజ్ తో పవర్ స్టార్ అయ్యాడు పవన్ కళ్యాణ్. చేసింది తక్కువ సినిమాలే,ఫీల్డ్ లోకి వచ్చింది కూడా లేట్ గానే. అయితేనేం లక్షలాది మంది ఆయన వెంట నడిచేలా చేసుకున్నాడు. పవన్ ఆగిపొమ్మంటే ఆగిపోతారు,రమ్మంటే వస్తారు. అలా అభిమానులను సైతం మలచుకున్నాడు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు అన్నవెంట నడిచిన పవన్, ఆతర్వాత ఆపార్టీలో టికెట్ల వ్యవహారంలో జరిగిన పొరపాట్లు,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పార్టీకి దూరంగా జరిగాడు. అన్నయ్య చిరంజీవి,వదిన సురేఖ లను దైవంగా భావిస్తూ, వచ్చిన పవన్ తన సిద్ధాంతాలకు అన్నతో సైతం విభేదించి విడిగా ఉంటున్నాడు.
జనసేన పార్టీని జనంలోకి తీసుకెళ్లి,వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని సీట్లలో పోటీ చేసేందుకు పవన్ సన్నద్ధం అయ్యాడు. ఇప్పటికే ఆయా జిల్లాలో పర్యటిస్తూ చేస్తున్న విమర్శలకు ప్రభుత్వం లో కదలిక వస్తోంది. కొందరు నేతలైతే,పవన్ ఏ బాంబ్ పేలుస్తాడోనని వణికిపోతున్నారు. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే పవన్,గత ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని,సీఎం చంద్రబాబుని సమర్ధించి ఎంతగా పొగిడాడో,ఇప్పుడు వాళ్ళ వ్యవహార శైలి తెలుసుకుని అంతకంటే ఎక్కువగానే ఏకి పారేస్తున్నాడు. ఇది సహజంగానే ఆ పార్టీలకు ఇబ్బందిగా మారింది.
అసలు పవన్ కి జనంలో ఇంతగా వస్తున్న ఫాలోయింగ్ ని చూసి ఆయా పార్టీల వాళ్ళు జనసేన గూటికి వస్తున్నారు. 1996నుంచి ఇప్పటిదాకా 25సినిమాలు మాత్రమే చేసిన పవన్ కి ఫాలోయింగ్ ఇంతవుందా అని అందరూ నోరెళ్లబెడ్తున్నారు. తాటాకు మంటలా ఉవ్వెత్తున ఎగిసిపడే పవన్ కి తననైజం వలన కొన్ని సమస్యలను తెచ్చిపెట్టుకున్నాడు. అయినా తన ధోరణి మార్చుకోకుండా ప్రజల బాధల్ని చూసి చలించిపోతున్నాడు.
అందరికి సహాయపడాలన్న ధోరణి, ఎవరూ లేరన్న వారిని నిరుత్సాహ పరచకుండా సాయం చేస్తుండాలన్న సంకల్పం ఆయన లోని ప్లస్ పాయింట్స్.
ఎక్కడ ఎవరికీ ఏ కష్టం వచ్చినా,తాను సహాయపడుతూ, అభిమానులు కూడా చేతనైనంత సాయం చేయాలనీ కూడా సూచిస్తుంటాడు. ఇక ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్న అంశం పదేపదే తెరమీదికి తెస్తూ,ప్రత్యర్ధులు ఆరోపణలు చేస్తున్నారు.
దీన్ని వ్యక్తిగత అంశంగా తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నాడు. చదువు ఎక్కువ లేకున్నా, పుస్తకాలు చదవడం,ఫ్రెండ్స్ తో ఎక్కువగా మాట్లాడ్డం,ప్రముఖులతో మాటామంతి ఇలా చేయడం వలన బాగా పరిణతి చెందాడు. మొత్తానికి పవన్ లోని మేజిక్ అందరినీ అతనికి దగ్గర చేరుస్తోంది.