Movies

విక్రమార్కుడులో నటించిన ఈ పాప ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో తెలుసా?

తెలుగులో బాలనటులకు కొదవలేదు. ఎందరో వస్తుంటారు. కొందరు ఒకటి రెండు సినిమాలతో వెళ్ళిపోయినా,పెద్దయ్యాక మళ్ళీ ఎంట్రీ ఇచ్చి రాణిస్తుంటారు. కొందరు బాలనటులుగా వరుస ఛాన్స్ లతో దూసుకుపోతారు. ఇదే కోవలో రక్ష మూవీలో చేసిన నేహా. అమెరికాలో పుట్టినా ఇండియాలోనే పెరిగిన తోట నేహా, తొలిసినిమా రక్షతోనే తానేమిటో నిరూపించుకుంది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో జగపతి బాబు,కళ్యాణి నటించిన ఈ సినిమాలో దెయ్యం పట్టిన పాప వేషంలో అద్భుతంగా నటించి అందరినీ అబ్బుర పరిచింది. విక్రమార్కుడు,రాముడు వంటి సినిమాల్లో నటించిన రక్ష ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క సినిమాల్లో నటిస్తోంది.

అమెరికా నుంచి ఇండియా వచ్చి నేహా పేరెంట్స్ సెటిల్ అయ్యారు. అప్పుడు నేహాకు మూడేళ్లు. తండ్రి వెంకటేశ్వరరావు, తల్లి రూప. నేహాకు ఓ అన్నయ్య ఉన్నాడు. అమెరికా నుంచి వచ్చిన రెండేళ్లకే రక్షలో ఛాన్స్ వచ్చింది. ఎంతో అనుభవం గల నటిగా తన సత్తా చాటింది. నిజానికి నాలుగేళ్ల వయస్సులోనే నేహాకు రాజమౌళి మూవీలో ఛాన్స్ వచ్చినా,షూటింగ్ వెళ్ళినపుడు ఏడుస్తూ కనిపించడం వలన ఛాన్స్ కోల్పోయింది. అయితే విక్రమార్కుడులో ఛాన్స్ కొట్టేసింది.

ఇక నేహా 16ఏళ్ళ ప్రాయంలో అడుగుపెట్టింది. డాన్స్ చేయడం,పాటలు పాడడం అమితమైన ఇష్టంగా చెప్పే నేహా,ప్రస్తుతం హైద్రాబాద్ లో చదువుతోంది. బాగా చదువుకుని పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలన్నదే ఆమె కోరికట. తనకు వచ్చిన ఛాన్స్ లు మిస్ కాకుండా నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ చదువు సాగిస్తోంది. అయితే ఈమె డాక్టర్ అవుతుందో , యాక్టర్ అవుతుందో చూడాలి.