Movies

శ్రీదేవి,జయప్రద,జయసుధ వీరిలో నెంబర్ 1 హీరోయిన్ ఎవరో చూడండి

ఒకప్పుడు హీరో హీరోయిన్స్ జంట అంటే అభిమానులకు చూడముచ్చటగా ఉండేది. పాతిక ముప్పై సినిమాలతో హిట్ ఫెయిర్ గా నిలిచేది. ఇప్పుడు ఒకటి రెండు సినిమాలకే హీరోయిన్స్ మొహం మొత్తేసి కొత్త హీరోయిన్ కోసం వెతుకులాట సాగిపోతోంది. కానీ 80 – 90దశకాల్లో హీరోయిన్స్ చాలాకాలం నిలదొక్కుకున్నారు. తమ యాక్టింగ్ టాలెంట్ తో చిత్రసీమని ఏలారు. అందం,అభినయం కూడా తోడవడంతో మరింత రాణించారు. శ్రీదేవి,జయప్రద,జయసుధ అదేకోవలోకి వస్తారు. తెలుగు ఫీల్డ్ ని దాదాపు రెండు దశాబ్డ్లపాటు ఏలిన ఘనత వీరిది.

బాలనటిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి,పెద్దయ్యాక హీరోయిన్ గా రాణించి, అన్ని భాషల్లో పేరు తెచ్చుకుంది. తెలుగు,తమిళం,మలయాళం ఇలా అన్ని భాషల్లో శ్రీదేవి సినిమాలు కనిపించేవి. ఇంకా విశేషం ఏమిటంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎవరి పక్కన నటించిందో వారి పక్కనే హీరోయిన్ గా వేసిన ఘనత శ్రీదేవికి చెల్లింది. 16ఏళ్ళ వయస్సుతో కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీదేవి వేటగాడు,కార్తీకదీపం,సర్ధార్ పాపారాయుడు,బెబ్బులి పులి,కొండవీటి సింహం,ప్రేమాభిషేకం,దేవత కిరాయికోటిగాడు, పచ్చనికాపురం,జస్టిస్ చౌదరి వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలతో టాప్ రేంజ్ లో కొనసాగింది. ఎన్టీఆర్,ఏ ఎన్ ఆర్, శోభన్ బాబు ,కృష్ణ,లాంటి హీరోలు తమ పక్కన శ్రీదేవి ఉండాలని డిమాండ్ చేసేవారట. ఆమె డేట్స్ ఖాళీ లేకుంటే,అప్పుడు ఇతర హీరోయిన్స్ వైపు చూసేవారట. ఇక తర్వాత తరం నటులైన చిరంజీవి,నాగార్జున,వెంకటేష్ లతో కూడా శ్రీదేవి నటించి మెప్పించడం మామూలు విషయం కాదు. ఈమె గ్లామర్ ఆ రేంజ్ లో ఉండేది. అందుకే చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి,నాగ్ తో ఆఖరి పోరాటం,వెంకీతో క్షణం క్షణం మూవీలు బ్లాక్ బ్లస్టర్ గా నిలిచాయి.
Jayaprada – MP from Rampur Constituency, UP
ఇక గ్లామర్ కి నిర్వచనం జయప్రద. ఈమె అసలు పేరు లలితారాణి. 14ఏళ్ళ వయస్సులో ఆమె ఇస్తున్న నాట్య ప్రదర్శన చూసి,నటుడు ప్రభాకర్ రెడ్డి ఆమెని సినీ రంగానికి పరిచయం చేస్తూ, జయప్రద అనే పేరు పెట్టాడు. సీతాకళ్యాణం,శ్రీ రాజరాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్ సిరిసిరి మువ్వ , అంతులేని కథ వంటి విభిన్న చిత్రాలతో అప్పటి యువత గుండెల్లో గిలిగింతలు పెట్టింది జయప్రద. ఇక అడవి రాముడు,యమగోల లాంటి హిట్స్ ఇచ్చిన జయప్రద ఎన్టీఆర్ కి సెంటిమెంట్ హీరోయిన్ గా మారింది. సాగర సంగమం,మేఘ సందేశం వంటి చిత్రాలతో జయప్రద లోని అసలు సిసలైన నటి వెలుగు చూసింది. ఎక్స్ పోజింగ్ తో కాకుండా నటనతోనే అగ్ర హీరోయిన్ గా వెలుగొందడం జయప్రద లోని గొప్ప టాలెంట్. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళం,హిందీ ,బెంగాలీ చిత్ర పరిశ్రమలో జయప్రదను తమ ప్రాంత మహిళగానే భావించడం ఆమె టాలెంట్ కి మరో నిదర్శనం.

కాగా అప్పట్లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన జయసుధ కు సహజ నటి అనే బిరుదుని సొంతం చేసుకుంది. ఈమె అసలు పేరు సుజాత. సినిమాటిక్ గా ఉండడానికి జయసుధ అని మార్చుకుంది. 1972లో వచ్చిన పండంటి కాపురం మూవీతో జయసుధ కెరీర్ మొదలై, శివరంజని, యుగంధర్,మేఘసందేశం,మాంగల్యబలం వంటి సినిమాలతో అనతికాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. జయసుధ ఉంటే హిట్ అనే సెంటిమెంట్ ఈమెకు కూడా ఉండడంతో కనీసం సెకండ్ హీరోయిన్ గానైనా ఇరికించి సినిమాలో పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయట. ఆదివారాముడు, జ్యోతి,నాదేశం,తాండ్ర పాపారాయుడు,బొబ్బిలి బ్రహ్మన్న,ప్రేమాభిషేకం,వంటి చిత్రాలు ఆమె నటనకు గీటురాయి. ఇక ఈమెకు వచ్చినన్ని నంది అవార్డులు ఇంకో హీరోయిన్ కి రాలేదని చెప్పాలి.

ఒక్క షాట్ లోనే సీన్ కంప్లిట్ అవ్వాలన్న రీతిలో ఆమె నటన ఉండేది. హీరోలు టేక్ లు ఎన్ని తీసుకున్నా, ఈమె ఒకే టేక్ లో ఒకే అయిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయట. ఇప్పటికీ ఎలాంటి రిహార్సల్స్ లేకుండా ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చే ఏకైక నటి జయసుధ అని చెబుతారు.
ఇక శ్రీదేవి,జయప్రద,జయసుధ ముగ్గురూ కూడా అన్ని భాషల్లో సినిమాలు చేసారు. ఈ ముగ్గురూ తెలుగు,తమిళ,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో అగ్ర హీరోయిన్స్ గా నటించారు.

ఇక ముగ్గురూ కూడా బాలీవుడ్ నిర్మాతలని పెళ్లి చేసుకున్నారు. శ్రీదేవి బోనీకపూర్ ని ,జయప్రద శ్రీకాంత్ నహతాను,జయసుధ నితిన్ కపూర్ ని వివాహం ఆడింది. అయితే వీరి ముగ్గురులో ఏ భాషలో నటించిన అక్కడి ప్రత్యేకత నిలుపుకోవడం ద్వారా శ్రీదేవి నెంబర్ వన్ గా నిల్చింది. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్,ఏ ఎన్ ఆర్,శోభన్ బాబు,కృష్ణ,కృష్ణంరాజు ల పక్కన నటించిన శ్రీదేవి,తర్వాత తరం చిరంజీవి,నాగార్జున,వెంకటేష్ పక్కన నటించి మెప్పించడమే కాదు, మిగిలిన భాషల్లోనూ ఇలాంటి ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది.