ఈ భామల సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
దక్షిణాదిన అత్యధిక పారితోషికం ఎవరు తీసుకుంటున్నారో తెలుసా? ‘జై సింహ’ సినిమాలో నటించినందుకు నయనతార రూ.1.75 కోట్లు తీసుకుంది. అయితే ఆమె ఈ సినిమాకి కేవలం 30 రోజులను మాత్రమే కేటాయించింది. అంటే రోజుకి సుమారుగా 6 లక్షల పారితోషికం తీసుకోని దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా పేరొందింది. అదే కథానాయక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు అయితే నయనతార రెండున్నర కోట్లు తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాల్లో నయనతార కనపడటం లేదు. ఎందుకంటే ఆమె పారితోషికం విని నిర్మాతలు భయపడిపోతున్నారు.
అనుష్క కూడా నయనతార బాటలోనే ఉంది. అనుష్క కూడా సినిమాకి దాదాపుగా ఒకటిన్నర నుండి రెండు కోట్ల వరకు తీసుకుంటుంది. ఆమె ‘బాగమతి’ సినిమా కోసం రెండు కోట్లను తీసుకుంది. తమిళ సినిమాకి అయితే కోటి వరకు ఛార్జ్ చేస్తుంది. అనుష్క కూడా కమర్షియల్ సినిమాలను చేయకుండా కథానాయక ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది.
రకుల్‌ప్రీత్ సింగ్‌కి మొన్నటి వరకూ డిమాండ్ భారీగా ఉండేది. ‘జయ జానకీ నాయక’కి రూ.కోటిన్నర వరకూ పారితోషికం తీసుకోని ఆమె కెరీర్‌లో ఇదే భారీ పారితోషికం. ఆమె కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకొనేది. ఇప్పుడు ఆమె అవకాశాల కోసం 90 లక్షలకు దిగింది. తమన్నా మంచి జోరు మీద ఉన్నప్పుడు కోటి రూపాయలకు ఎప్పుడు తగ్గలేదు. ఆమె హావ తగ్గినా సరే ఆమె పారితోషికం విషయంలో ఎక్కడ దిగటం లేదు.కాజల్ ‘ఖైది నెం.150’కి కోటి పాతిక లక్షలు అందాయట. ఈమధ్య ఓ యువ కథానాయకుడి సినిమా కోసం ఆమెను సంప్రదిస్తే రెండు కోట్ల వరకూ డిమాండ్ చేసిందని చెబుతున్నారు. శ్రుతిహాసన్ కూడా కోటి మార్కు చూసిన కథానాయికే. కానీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమెకు డిమాండ్ బాగా తగ్గిపోయింది.
కోటికి తక్కువగా ఎవ్వరూ లేరా? అంటే ఆ జాబితా కూడా ఉంది. రాశీఖన్నా, అను ఇమ్మానియేల్, సాయి పల్లవి వీళ్లంతా కోటికి దరిదాపుల్లో ఉన్నవాళ్లే. ‘ఫిదా’ కోసం సాయి పల్లవి రూ.40 లక్షలు డిమాండ్ చేసింది. ఆ సినిమాతో ఆమె రేంజు ఎక్కడికో వెళ్లిపోయింది. మళ్లీ అదే సంస్థలో ‘ఎంసీఏ’ చేసింది. కానీ ఆ సినిమాకి ఆమె దాదాపుగా రూ.70 లక్షలు అందుకుంది. ఇప్పుడు సాయి పల్లవి రూ.90 లక్షలు డిమాండ్ చేస్తోందట.
అనుపమ పరమేశ్వరన్ రూ.40 లక్షలు అందుకుంటోంది. అనూ ఇమ్మానియేల్ కూడా ఇంచుమించుగా అంతే ఉంది. కీర్తి సురేష్ పారితోషికం సినిమా సినిమాకీ పెరుగుతోంది. ‘మహానటి’ కోసం ఆమెకు దాదాపు కోటి రూపాయల వరకూ ఇచ్చారు. అయితే ‘అజ్ఞాతవాసి’కి రూ.75 లక్షలే ముట్టజెప్పారు.