తల్లి హీరోయినే అయినా…. తరుణ్ సక్సెస్ కాకపోవడానికి కారణం ఎవరు?
భక్త ప్రహ్లాద సినిమాలో బేబి రోజారమణిగా చాలా మంచి పేరు సంపాదించింది. ఆ సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ బాల నటిగా పురస్కారం పొందింది. 1970 మరియు 1980 వ దశకాల్లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినిమాలలో కథానాయికగా చాలా బిజీగా నటించింది. అంతేకాక సుమారు 400 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. ఆమె బ్లూ క్రాస్ లో సభ్యురాలిగా చేరి సమాజ సేవ చేస్తోంది.
రోజారమణి కొడుకు మాస్టర్ తరుణ్ అనే పేరుతో బాలనటుడిగా నటించి మంచి పేరు సంపాదించాడు.
ఆ తర్వాత ‘నువ్వే కావాలి’ అంటూ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే కొంత సక్సెస్ వచ్చాక సరైన కథలను ఎంచుకోవటంలో చేసిన తప్పుల కారణంగా తరుణ్ కెరీర్ సరిగా సాగలేదు. ఒక విధంగా చెప్పాలంటే తరుణ్ కెరీర్ ఇలా అవ్వటానికి తరుణ్ స్వయంగా చేసుకున్న తప్పులే అని చెప్పవచ్చు.
ఇక రోజారమణి విషయానికి వస్తే…. మద్రాసులో జన్మించిన రోజారమణి తండ్రి ఒక విలేఖరి. ఆమెకు ఇద్దరు సోదరులున్నారు. ఆమె ఒడియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్నది. ఆయన ప్రస్తుతం ఈటీవీ ఒడియా చానల్ లో దర్శకుడు మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
వారి కుమారుడు ప్రముఖ తెలుగు నటుడు తరుణ్. కూతురు అమూల్య సైకాలజీ గ్రాడ్యుయేట్. కూతురు కూడా సినిమా రంగంలోకి వస్తుందనే వార్తలు ఆ మధ్య విన్పించాయి. ఆమె 5 సంవత్సరాల వయసులో భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడిగా నటించింది. ఏవీయం నిర్మించిన ఈ సినిమా మొట్టమొదటి పూర్తి నిడివి ఈస్ట్ మన్ కలర్ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.
బాలనటిగా సుమారు 70 సినిమాల్లో నటించిన తర్వాత 13 ఏళ్ళ వయసులోనే చంబరతి అనే మలయాళ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇదే సినిమా తెలుగులో కూడా రోజా రమణి కథానాయికగా కన్నె వయసు అనే సినిమా గా, తమిళంలో పరువ కాలంగా పునర్నిర్మించారు.
తరువాత అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీ, ఒడియా భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 400 సినిమాల్లో సుహాసిని, మీనా, రాధిక, రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, శిల్పాశెట్టి, దివ్యభారతి, నగ్మా, కుష్బూ లాంటి నటీమణులకు గాత్రదానం చేసింది.