కార్తీక పౌర్ణమి ఎప్పుడు నవంబర్ 22 ? 23 ? ఏ రోజు జరుపుకోవాలి

కార్తీక మాసంలో వెచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. కార్తీక పౌర్ణమికి ఎంతో విశిస్టమైన రోజు.ఈ కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైనది. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. కార్తీక పౌర్ణమి రోజ్ శివుణ్ణి,విష్ణువును పూజిస్తారు. ఈ రోజు శివునికి,విష్ణువునికి ఎంతో ప్రియమైనవి. ఈ రోజు శివరాదన,దీపాలు వెలిగించటం చాలా ముఖ్యం. కార్తీక పౌర్ణమి రోజున ఉదయం తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేయిస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. అలాగే అస్త ఇశ్వర్యాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజున కేదారేశ్వరుని వ్రతం,సత్యదేవుని వ్రతం చేసుకుంటారు.

ఈ నోములు నోచుకోనేవారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నోము నోచుకుంటారు. నక్షత్ర దర్శనం అయ్యాక ఫలహారం తీసుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజు కార్తీక పురాణం పుస్తకం పంచిపెడితే మంచిది. అలాగే స్రీలు తమ సౌబగ్యం కోసం పసుపు,కుంకుమ,తాంబూలం,శనగలు ముత్తయూదలకు ఇవ్వాలి. ఇలా చేయటం వలన గురు బలం పెరిగి మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు రావు. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం కలుగుతుంది.

ఇంత మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమిని నవంబర్ 22 జరుపుకోవాలా లేదా 23 జరుపుకోవాలా అనే సంశయం చాలా మందిలో కలుగుతుంది. నవంబర్ 22 వ తేదీన పౌర్ణమి తిధి మధ్యాహ్నం 12.53 నిమిషాల నుండి 23 వ తేదీ ఉదయం 11.09 నిమిషాల వరకు ఉంది. దాంతో కార్తీక పౌర్ణమిని 22 జరుపుకోవాలా లేదా 23 జరుపుకోవాలా అనే విషయంలో బిన్నమైన అభిప్రాయాలూ కలుగుతున్నాయి. పౌర్ణమి ఉండే రాత్రిని పౌర్ణమిగా జరుపుకోవాలని శాస్త్రాలు చెప్పుతున్నాయి. కాబట్టి రాత్రి సమయంలో పౌర్ణమి 22 వ తారీఖున ఉంది కాబట్టి 22 వ తేదీన కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని అంటున్నారు.