Movies

అయన లేకపోతే మహేష్ కెమెరా ముందుకు వెళ్ళలేడు… ఇంతకీ అయన ఎవరో తెలుసా?

మహేష్ బాబు అంటే అమ్మాయిల రాకుమారుడు. ప్రతి సినిమాలో తన అందమైన లుక్స్ తో అందరి మనస్సులను దోచుకుంటాడు. మహేష్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి చిన్నతనంలోనే హిట్స్ అందుకున్నాడు. మహేష్ హీరోగా ‘రాజకుమారుడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.మహేష్ పరిశ్రమలో వివాదాలకు దూరంగా అందరితోనూ స్నేహంగా ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ఆ ట్యాగ్ పోగొట్టుకోవడానికి చాలానే కష్టపడ్డాడని చెప్పాలి. 
మహేష్ తన స్టాప్ ని కూడా కుటుంబ సభ్యుల వలె ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం మహేష్ తన ఫేస్ బుక్ లో చేసిన ఒక పోస్ట్ చూస్తే అర్ధం అవుతుంది. మహేష్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి పట్టాభి మహేష్ కి మేకప్ వేస్తున్నారు. మహేష్ అంత అందంగా కనపడటం వెనక పట్టాభి కృషి చాలానే ఉంది.అలాంటి పట్టాభి గురించి గుర్తు చేసుకుంటూ… ‘‘ఆయన లేకపోతే నేను కెమేరా ముందుకు వెళ్లలేను’’ అన్నాడంటే మహేష్ తన సిబ్బందికి ఇస్తున్న గౌరవం అలాంటిది. గత 24 ఏళ్లుగా తనకు మేకప్ మ్యాన్‌గా ఉన్న పట్టాబి గురించి చెబుతూ మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఫొటో పోస్టు చేశాడు.