కోటి దీపోత్సవంలో పవన్ పై అన్నా లెజినోవా షాకింగ్ కామెంట్స్ … షాక్ లో పవన్ అభిమానులు
హీరోలకు అభిమానులు ఉండడం సహజం. కానీ కొందరు హీరోలకు ఉండే ఫాన్స్ ని అభిమానులు అనే కన్నా భక్తులు అనడం మంచిదేమో అన్నట్టు ఉంటారు. తమ అభిమాన హీరోనే దేవుడిగా కొలిచే ఫాన్స్ చాలాకొద్ది మంది హీరోలకే వుంటారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన ఏది చెబితే అది చేయడానికి ఫాన్స్ సిద్ధంగా ఉంటారు. అలాంటి పవన్ ఇప్పుడు సినిమాలు వదిలేసి,రాజకీయాల్లోకి దూకారు. జనసేన పార్టీ ద్వారా జనంలో దూసుకుపోతున్నారు. అన్నివర్గాలను కలుపుకుని వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
హీరోగా సినిమాల్లో అభిమానించి, కొలిచిన విధంగానే రాజకీయాల్లో కూడా పవన్ పాలిట భక్తుల్లో జనసైనికులు ఉంటున్నారు. అధికార పక్షంపై వాడీవేడీ విమర్శలు గుప్పిస్తూ జనంలోకి చొచ్చుకుపుతున్న పవన్ కళ్యాణ్ చూసి అధికార పక్షంలో గుబులు పుడుతోంది. ఇక పర్సనల్ విషయానికి వస్తే, పవన్ భార్య అన్నా లెజినోవా విదేశీ మహిళ అయినప్పటికీ కట్టుబొట్టూ సంప్రదాయం అన్నీ భారతీయతను ఉట్టిపడేలా,ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతికి తగ్గట్టు ఉంటాయి. మొత్తం మీద భారతీయ మహిళగా రూపాంతరం చెందింది. పవన్ కి అన్నిరకాల సపోర్ట్ అందిస్తోంది.
ఇక జనంలో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ అన్నివర్గాలను ప్రభావితం చేస్తున్నారు. భార్య, పిల్లలను కలవకుండా దూరంగానే ఉంటున్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఎన్టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి పవన్ వెళ్లారు. దీనిపై మీడియాలో వార్తలు కూడా బానే వచ్చాయి. దీంతో అన్నా లెజినోవా షాకింగ్ కామెంట్స్ చేసింది.
సహజంగానే ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి. ఇంతకీ ఆమె ఏముందో తెలుసుకుందాం. ఇలాంటి కార్యక్రమానికి తాను కూడా వెళ్లి ఉంటె బాగుండేదని అన్నా లెజినోవా’పవన్ గారు నన్ను కూడా తీసుకెళ్లి ఉంటే ఓ అద్భుతం చూసే దాన్ని ‘అని తన సన్నిహితుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర వ్యాఖ్యానించారట.