Movies

కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నా సరే ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కారునే వాడుతున్న ఈ విలన్ గురించి నమ్మలేని నిజాలు

హావ భావాలకు,ఆహార్యానికి,అభినయానికి భాషతో సంబంధం లేదని ఎన్నో సినిమాలు రుజువుచేశాయి. ఎందరో నటీనటులు ఏ బాష వారైనా సరే,తమ టాలెంట్ తో రాణిస్తున్నారు. అందులో మనం చెప్పుకోబోయే ఆశిష్ విద్యార్థి ఒకరు. పాపే మా ప్రాణం మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ విద్యార్థి, పోకిరి మూవీలో విలనిజం తో కూడిన క్రూరమైన పోలీసుగా నటించి మెప్పించి,అంతకుముందు గుడుంబా శంకర్ లో కామెడీ విలన్ గా పండించి, భిన్నమైన నటన చేయగలడని నిరూపించాడు. అన్నవరం,రారాజు,చిరుత,అదుర్స్,తులసి,లక్ష్యం ఇలా పలుచిత్రాల్లో తనదైన నటన కనబరుస్తూ వచ్చాడు. తెలుగు,తమిళం,హిందీ ,కన్నడం,బెంగాలీ,మలయాళం, ఇంగ్లిష్,మరాఠీ,భోజ్ పూరి,గుజరాతీ ఇలా ఏకంగా 11భాషల్లో నటించే నటుడు ప్రస్తుత రోజుల్లో ఆశిష్ ఒక్కడేనని చెప్పవచ్చు.

కేరళకు చెందిన ఆశిష్ 1962జూన్ 19న పుట్టారు. తండ్రి పేరు గోవింద్ విద్యార్థి,తల్లిపేరు రేబా. ఆమె సుప్రసిద్ధ కథక్ కళాకారిణి. ఢిల్లీలోని సంగీత నాటక అకాడెమీలో తండ్రి ఉద్యోగి. దీంతో ఆశిష్ స్టడీస్ ఢిల్లీలోనే జరిగాయి. ఢిల్లీలో ఉండగానే నాటకాల్లో నటించిన ఆశిష్ ని నాటక కళ ముంబై వైపు నడిపించింది. బాలీవుడ్ లో ఎన్ని రోల్స్ చేసినా,సంతృప్తి లేకపోవడంతో దక్షిణాదిన అడుగుపెట్టాడు.

ఎలాంటి రోల్ అయినా ఆశిష్ పండిస్తాడన్న నమ్మకం,గురి ఏర్పడ్డాయి. అందుకే అతడిని దృష్టిలో ఉంచుకుని పాత్రలకు రూపకల్పన చేసే స్థాయి వచ్చింది. ఐదారేళ్ళ క్రితం మిణుగురు చిత్రంలో వేసిన పాత్రకు నంది పురస్కారం అందుకున్న ఆశిష్, ఇంకా పలు చిత్రాల్లో నటనకు ఆడియన్స్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగువారికి బాగా కనెక్ట్ అయ్యాడు. నిజానికి ఉత్తరాది విలన్ లకు సౌత్ ఇండియాలో డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో అడుగుపెట్టిన ఆశిష్ విద్యార్థికి తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలు పెద్దపీట వేసాయి.

వరుసపెట్టి ఛాన్స్ లు వచ్చిపడడంతో అనతికాలంలోనే తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో ఆశిష్ టాప్ మోస్ట్ విలన్ అయ్యాడు. ఇక ముంబయిలో ఉండగానే ఇతడికి పెళ్లి అయ్యింది. ఒక కొడుకున్నాడు. ఇక హైదరాబాద్ లోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. అయితే పెళ్ళాం,కొడుకు మాత్రం ఇప్పటికీ ముంబైలోనే ఉన్నారు. సింపుల్ సిటీకి అలవాడు పడిన ఆశిష్ డాంబికాలకు దూరంగా ఉంటాడు. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నా సరే,ఇప్పటికీ సెకండ్ హ్యాండ్ కారునే వాడడం ఆయన స్పెషాల్టీ. ‘కొత్తకారు అయినా సరే అందరూ నన్నే చూస్తారు తప్ప కారుని చూడరు కదా. అలాంటప్పుడు ఏ కారు అయితేనేం’అని ఆశిష్ అంటుంటారు.