Devotional

బాల సాయిబాబా గురించి కొన్ని నమ్మలేని నిజాలు

మనదేశంలో బాబాలకు ,స్వామిజిలు కొదవలేదు. కొందరు నకిలీ బాబాలున్నా, మరికొందరు జనాన్ని ప్రభావితం చేస్తూ, సేవా కార్యక్రమాలు పెద్దఎత్తున చేపడుతూ సమాజంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి పేరు తెచ్చుకున్న బాలసాయిబాబా నాలుగు దశబ్దాలుగా సాయి బోధనలు ప్రచారం చేస్తూ,బాల సాయిబాబా గా ప్రచారం పొందిన ఈ బాబా అసలు పేరు బాలరాజు. 1960జనవరి 14న కర్నూల్ లో జన్మించారు. ఈయన తండ్రి పేరు రామనాధ శాస్త్రి. నిజానికి వీళ్లది కేరళ రాష్ట్రం. ఉపాధి కోసం కర్నూల్ వలస వచ్చారు.. కేవలం పదవ తరగతి వరకు చదివిన బాలరాజుకు విపరీతంగా లోకజ్ఞానం ఉండేది. టెన్త్ పూర్తయ్యే సమయానికి ఆధ్యాత్మిక విషయాలపై పూర్తిగా పట్టు సాధించారు. ఇక కళలపై విపరీతంగా మక్కువ గల బాలరాజు మంచి గాయకుడు.

18ఏళ్ళ ప్రాయంలో ఆశ్రమం ఏర్పాటుచేశారు. మొదట్లో బలరాజుగానే చెప్పుకున్నప్పటికీ ఆతర్వాత తనను తాను సాయిబాబా ప్రత్యేక్ష అవతారంగా ప్రకటించుకుని,బాల సాయిబాబాగా రూపాంతరం చెందారు. సంక్రాంతి పండుగ వస్తే చాలు ఆశ్రమంలో సందడి వాతావరణం పరచుకుంటుంది. ఎందుకంటే బాలసాయి జన్మదిన వేడుకలను అంత్యంత ఘనంగా భక్తులు జరుపుతారు. ఇక మహాశివరాత్రి వస్తే,నోట్లోంచి శివలింగం తీసి భక్తులను ఆశ్చర్యం పర్చడం వంటి ఎన్నో అద్భుతాలు చేసేవారు.

మెడిసిన్, ఫిలాసఫీ తదితర రంగాల్లో ఎం ఏ చేశానని, ఐదు పీహెచ్ డీలు చేశానని చెప్పుకునేవారు. అంతేకాదు కళింగ యూనివర్సిటీ విసిగా చేసినట్లు కూడా అనేక సందర్భాల్లో చెప్పుకునేవారు.కాగా భూ కబ్జాలకు పాల్పడినట్లు,భక్తుల నుంచి అక్రమంగా విరాళాలు సేకరించినట్లు,ఆరోపణలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఆయన పెళ్లి చేసుకోలేదు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని కన్నా తానే గొప్పని,భక్తుల కోర్కెలు తీర్చుకునే నేను గొప్పా, బండరాయి రూపంలో ఉండే వేంకటేశ్వరుడు గొప్పా అంటూ కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

ఇక ఈయన ఆర్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. హైదరాబాద్ లో ఉండే బాలసాయి కి ఛాతీలో సోమవారం రాత్రి తీవ్రంగా నొప్పి రావడంతో విలవిల లాడిపోయారు. దీంతో ఆశ్రమ సిబ్బంది వెంటనే హాస్పిటల్ లో చేర్చారు. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు రోదిస్తున్నారు.