చిరంజీవి పక్కన నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

ఆ రోజుల్లో ప్రేమికుల మనసు దోచుకునే అద్భుత సినిమా వచ్చింది. తమిళ డైరెక్టర్ టి రాజేందర్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమా అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. అదే ప్రేమసాగరం మూవీ. హీరో గంగ , హీరోయిన్ నళిని. ఆ సినిమాతో నళిని యువ హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. నిజానికి 13ఏళ్ళ వయస్సులోనే హీరోయిన్ గా నటించి,స్టార్ హీరోయిన్ గా మారిన నళిని ఆతరువాత కాలంలో విలనిజం పండించి మళ్ళీ ఓ ఊపు ఊపేసింది. చిరంజీవి కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తీసిన సంఘర్షణ మూవీలో చిరు పక్కన హీరోయిన్ గా వేసి,స్టార్ డమ్ అందుకుంది.

మళయాళ కుటుంబానికి చెందిన నళిని తండ్రి పేరు మూర్తి ఆరోజుల్లో మళయాళ చిత్ర పరిశ్రమలో టాప్ కొరియోగ్రాఫర్. తల్లి గృహిణి. నళినికి నలుగురు అన్నలు,ఇద్దరు చెల్లెళ్ళు. నళినిని సినీ హీరోయిన్ గా చూడాలని తల్లికి ఆశగా ఉండేది. అయితే సినీ రంగంలోనే కొనసాగుతున్న తండ్రికి అది ఇష్టం ఉండేది కాదు. అయితే రాసిపెట్టి ఉంటే తప్పదన్నట్లు సినీ ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చాయి.

తండ్రి కొరియోగ్రాఫర్ కావడంతో సినిమా వాళ్ళు ఇంటికి వస్తూ పోతూ ఉండడం వలన నళిని చూసిన అసిస్టెంట్ డైరెక్టర్లు సదరు విషయాన్ని తమిళ డైరెక్టర్ రాజేందర్ చెవిన వేశారు. అలా తమిళ సినీ రంగంలోకి ఆమెను హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించాడు. అదే తమిళంలో బ్లాక్ బస్టర్ కావడంతో తెలుగులో ప్రేమసాగరం గా డబ్ చేసారు. టాలీవుడ్ లో కూడా అది సూపర్ డూపర్ హిట్ అయింది.365రోజులు ప్రదర్శనకు నోచుకుంది.

తెలుగులో కూడా నళిని మంచి హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపొయింది. కమలహాసన్,ముమ్ముట్టి,రజనీకాంత్ వంటి వారి సరసన నళిని హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఒకేరోజు ఐదారు మూవీస్ చేసేంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. చిరంజీవి తో ఇంటిగుట్టు,సంఘర్షణ వంటి సినిమాల్లో చేసింది. సినిమాలో జోరుగా ఉన్న రోజుల్లోనే తమిళ డైరెక్టర్ రామరాజన్ ని లవ్ మేరేజ్ చేసుకుంది.

ఇక వారికీ ఒకొడుకు,ఓ కూతురు కవలలుగా జన్మించారు. అయితే కొన్నేళ్ళకు వచ్చిన మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయి పిల్లలతో దూరంగా వెళ్ళిపోయింది. అలా సినీ రంగానికి దూరమైన నళిని కొంతకాలానికి కేరక్టర్ ఆర్టిస్టుగా విలనిజం పండించే కేరక్టర్లతో మెప్పించింది. సీతయ్య,వీడే మూవీలో నెగిటివ్ రోల్స్ తో మెప్పించిన నళిని తెలుగు,తమిళ సీరియల్స్ లో కూడా రాణిస్తోంది. అమ్మ నా కోడలా,మాతృదేవోభవ వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో లీడ్ రోల్స్ తో తనహవా కొనసాగిస్తోంది.