కార్తీక మాసం చివరి నుండి తులారాశి వారి జీవితం మారబోతుంది… పట్టిందల్లా బంగారమే…ఎలానో చూడండి
తులా రాశికి అధిపతి శుక్రుడు. కార్తీక మాసం చివరికి వచ్చేసరికి శుక్రుడు తులారాశిలోకి వస్తారు. అందువల్ల ఈ రాశివారికి శుక్రుని అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. తులా రాశివారు సొంతంగా నిర్ణయాలు తీసుకోని పనులను ప్రారంభిస్తే కార్యసిద్ధి జరగటమే కాకుండా వేగంగా అవుతాయి. సమయం అనుకూలంగా ఉండటం వలన ఈ రాశివారికి ఆర్ధికంగా చాలా బాగుటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అది అదృష్టంగా మారుతుంది. సాధ్యమైనంత వరకు ఎవరితోనూ విభేదాలు లేకుండా చూసుకోవాలి. పట్టుదలతో పనులను చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే పనులు పూర్తీ అయ్యేవరకు కాస్త ఏకాగ్రత పెడితే విజయం మీదే అవుతుంది.
ఆటంకాలు ఎన్ని ఎదురైనా దైర్యంగా ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశివారికి సొంత ఆలోచనే బలం. మీరు ఏ రంగంలో అడుగు పెట్టిన తిరుగు ఉండదు. అన్నింటా విజయం వరిస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులను ప్రారంభించవచ్చు. ఉన్నత వర్గాలతో పరిచయాలు ఏర్పడి అవి మీ అభివృద్ధికి దోహదం చేస్తాయి.
సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీరు చాలా కలం నుంచి ఎదురుచూస్తున్న కోరికలు అన్ని తీరతాయి. కుటుంబంతో కలిసి దైవ దైవ దర్శనాలు, విహారయాత్రలు చేస్తారు. ఈ రాశివారు ఎదుటి వ్యక్తులను ఆకట్టుకోవడంలో నేర్పరులు. వీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎత్తుకి పై ఎత్తు వేయటంలో నేర్పరులు. వీరికి ధనం లోటు లేకుండా ఉంటుంది. ఆర్ధిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు.
అంతేకాక ఈ రాశివారికి కార్తీక మాసం చివరకి వచ్చేసరికి అప్పటివరకు సన్నిహితంగా లేని బంధువులు కూడా సన్నిహితంగా ఉంటారు. వీరికి కుటుంబం నుండి మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. వీరు లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే అమావాస్య రోజు ఆంజనేయ స్వామి గుడిలో నేతితో దీపం పెట్టాలి.