సిమ్రాన్ కంటే అందంగా ఉండే అక్క మోనాల్ ఎలా చనిపోయిందో తెలుసా?

జీవితంలో కష్టాలు లేకుండా ఎవరూ ఉండరు. అది ఏ రంగమైనా సరే కష్టం ఉండితీరుతుంది. అయితే కొందరు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతారు. మరికొందరు కష్ఠాలను తట్టుకోలేక ప్రాణాలను సైతం తీసుకుంటారు. ఇక సినిమా రంగంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సిమ్రాన్ తెలుసు కదా. ఆమెకు మోనాల్ నావెల్ అనే ఓ చెల్లెలు ఉంది. సిమ్రాన్ కంటే అందగత్తె ఆమె. పైగా చేయడానికి ఎన్నో సినిమాలు కూడా ఉన్నాయి. చేతినిండా సినిమాలు పెట్టుకుని కూడా ఆమె ఆత్మహత్య చేసుకుంది. అందరినీ విషాదంలో ముంచేసింది. ప్రేమ వ్యవహారంలో తేడాయే ఇందుకు కారణమని తేలింది.

అశోక్ నావెల్, శారద దంపతులకు 1981జనవరి 26న ఢిల్లీలో జన్మించిన మోనాల్ నావెల్ ఢిల్లీలో ఇంటర్, ముంబయిలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని ముంబయిలో పూర్తిచేసింది. కన్నడంలో 2000లో వచ్చిన ఇంద్రధనస్సు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆమె 2001లో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన ఈమె తెలుగులో ఇష్టం సినిమా లో నటించింది.

ఇక బాలీవుడ్ లో ‘మా తుజే సలాం’మూవీలో నటించింది. ఈమె సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ తో పరిచయం ఏర్పడడం అది ప్రేమకు దారితీసింది. కొన్నాళ్ళు ప్రేమాయణం నడిచాక మనస్పర్థలు వచ్చి కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు. దీంతో మానసిక వేదనతో మోనాల్ కుంగిపోసాగింది. తీవ్ర మనోవేదన తట్టుకోలేక చెన్నైలోని ఆమె రూమ్ లో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పట్లో ఈమె మరణం పై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

కెరీర్ జోరుమీదున్న సమయంలో మోనాల్ మరణంతో డాన్సర్ సుజిత్ పై ఆరోపణలు వచ్చాయి. ఇక సిమ్రాన్ కూడా మీడియా ఎదుట బోరున విలపిస్తూ డాన్సర్ సుజిత్ కారణంగానే తన చెల్లి తమకు దూరం అయిందని ఆరోపించింది. కానీ ఈ కేసులో ఆమెకు న్యాయం జరగలేదు.