సింగర్స్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాయాక్టర్స్ ఎవరో తెలుసా?

పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు,ప్రేమ పెళ్లిళ్లు కూడా సమాజంలో జరుగుతున్నాయి. ఇక సినిమా రంగంలో అయితే పెద్దలు కుదిర్చిన వాటికన్నా ప్రేమ పెళ్లిళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరీ ఎక్కువగా ఉన్నాయి. హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లాడడమే కాదు ,వివిధ శాఖల్లోని వాళ్ళను కూడా నటులు పెళ్లాడిన ఘటనలు ఉన్నాయి. అదేవిధంగా సింగర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటులు కూడా ఉన్నారు. వాళ్లెవరో ఓసారి చూద్దాం. నందు – గీతా మాధురి వ్యవహారం చూస్తే, శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన ఫోటో మూవీతో ఎంట్రీ ఇచ్చిన నందు కి,గీత మాధురి కి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడి, అది ప్రేమగా మారింది. పెళ్లిచేసుకున్నారు.

జివి ప్రకాష్ ,సైంధవి లను తీసుకుంటే,ప్రకాష్ గాయకుడూ,సంగీత దర్శకుడు,నటుడు కూడా. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మన్ కి మేనల్లుడు అయిన ఇతను ఎక్కువగా తమిళ మూవీస్ సంగీతం సమకూర్చాడు. సినీ నిర్మాణం,నటన రంగంలోకి కూడా ప్రవేశించాడు. గాయని సైంధవితో స్కూల్ డేస్ నుంచే ఫ్రెండ్ షిప్ కొనసాగించడం, ఇద్దరూ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టడంతో ప్రేమకు దారితీసింది.

పెళ్లిపీటలు ఎక్కారు. అలాగే రఘు,ప్రణతి విషయంలోకి వెళ్తే,మిర్చి,ఆర్య 2, అఖిల్ సినిమాలకు డాన్స్ మాస్టర్ గా రఘు చేస్తే,యమదొంగ మూవీ తర్వాత ప్రణతి పేమస్ సింగర్ అయింది. కొన్నేళ్లుగా ప్రేమలు మునిగి తేలిన ఈ జంట పెద్దల ఆమోదంతో ఒక్కటయ్యారు.

హీరో రాహుల్ రవీంద్రన్ తీసుకుంటే యితడు అందాల రాక్షసి సినిమా సమయంలో గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి ప్రేమలో పడ్డాడు. పెద్దవాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకున్నాడు. కె విశ్వనాధ్ డైరెక్షన్ లో చిరంజీవి,సుమలత ప్రధాన జంటగా వచ్చిన శుభలేఖ మూవీతో సుధాకర్,తులసి మరో జంటగా నటించారు.

ఈ సినిమా హిట్ అవ్వడంతో శుభలేఖ సుధాకర్ అయ్యాడు. ఇక శుభలేఖ సుధాకర్,తులసి జంట ఆతర్వాత ప్రేమించు పెళ్లాడు,మంత్రిగారి వియ్యంకుడు చిత్రాల్లో కూడా రాణించింది. ఈయన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు సోదరి,ప్రముఖ సింగర్ ఎస్పీ శైలజను పెళ్లిచేసుకున్నాడు. పలు టివి సీరియల్స్ లో కూడా శుభలేఖ సుధాకర్ తనదైన ముద్ర వేసాడు.