వాన హీరో గుర్తు ఉన్నాడా… ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?
సినిమా ప్రపంచం అనేది ఒక మాయ ప్రపంచం. కొంతమందికి అవకాశాలు,అదృష్టం రెండు కలిసి వస్తాయి. మరి కొంతమందికి అవకాశాలు వచ్చిన అదృష్టం కలిసి రాదు. మొదటి సినిమా హిట్ అయితే ఆ హీరో కి వరుస అవకాశాలు క్యూ కట్టటం ఖాయం. కానీ ఈ యువ హీరో పరిస్థితి దానికి బిన్నంగా ఉంది. ఇక విషయంలోకి వెళ్ళితే…. 2008 లో వచ్చిన వాన సినిమాలో బెంగుళూర్ అబ్బాయి వినయ్ రాయ్ హీరోగా నటించాడు. వైరైటీ కథతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
వినయ్ మొదట మోడల్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తమిళ సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తరవాత తెలుగులో మీరా చోప్రా హీరోయిన్ గా వచ్చిన వాన సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు.
M.S.రాజు దర్శకత్వంలో వచ్చిన వాన సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వినయ్ కి కూడా మంచి పేరు వచ్చింది. వాన సినిమా హిట్ అయినా సరే వినయ్ ని టాలీవుడ్ పట్టించుకోలేదు. అవకాశాలు వస్తాయని కొంత కాలం వెయిట్ చేసిన నిరాశ ఎదురవటంతో తమిళ సినీ రంగానికి వెళ్ళిపోయాడు.
అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. వినయ్ నటించిన సినిమాలు హిట్ అయిన అవకాశాలు ఒకటి అర మాత్రమే వచ్చేవి. కొన్ని సినిమాలు అయితే కొన్ని రోజులు షూటింగ్ జరుపుకొన్నాక ఆగిపోయినాయి. దాంతో వినయ్ కాస్త డిప్రెస్ అయ్యాడట.
తనతో పాటు పరిశ్రమకు వచ్చినవారు హీరోగా యాక్ట్ చేస్తూ ఉంటే తాను మాత్రం సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉండాల్సి వచ్చిందని సన్నిహితుల వద్ద బాధపడేవాడు. వినయ్ కి మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.