Movies

రజినీకాంత్ సిగరెట్ తాగే స్టైల్ నేర్చుకోవటానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా?

రజనీకాంత్,శంకర్ కాంబినేషన్ లో వచ్చిన రోబో 2 ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ గా ముందుకు సాగుతుంది. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తుంది. రజనీకాంత్ బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ గా ఎదగడంలో ఎంతో కృషి,పట్టుదల ఉన్నాయి. రజనీకాంత్ స్టైల్ కి ప్రతి అభిమాని ఫిదా అవ్వాల్సిందే. ముఖ్యంగా సిగరెట్ వెలిగించడంలో ఆయన స్టైల్ ఎవరికి రాదు. ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సిగరెట్ కాల్చే స్టైల్ ని ఎలా నేర్చుకున్నారో వివరంగా చెప్పారు రజనీ.

రజనీకాంత్ బెంగుళూర్ లో ఉన్నప్పుడు సిగరెట్‌ను స్టైల్‌గా వెలిగించేందుకు చాల ప్రయత్నాలను చేసేవారట. మొదటిసారి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా ఇలాంటి స్టైల్‌ను ఓ హిందీ సినిమాలో ప్రదర్శించారు. అప్పటి నుంచి రజనీకాంత్ అద్దం ముందు నిల్చొని ప్రాక్టీస్ చేసేవారట. ఆ విధంగా ప్రాక్టీస్ చేయగా ఆ స్టైల్ వచ్చిందట.

సిగరెట్‌ను స్టైల్‌గా వెలిగించటానికి టైమింగ్ చాలా ముఖ్యమని, కేవలం విసరటం పట్టుకోవటం కాదని చెప్పారు. అలాగే తన నడక, వేగం గురించి మాట్లాడుతూ.. ‘అదంతా సహజంగా అబ్బిందే. వాటిని నేను సహజంగానే చేస్తాను. కానీ ప్రజలు స్టైల్ అంటారు’ అని చెప్పుకొచ్చారు.