ఈ హీరోయిన్స్ తొలి సినిమా వెనుక ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో తెలుసా?

సినీ ఛాన్స్ కోసం ఎంతోమంది పడిగాపులు కాస్తూ ఉంటారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని కాళ్లరిగేలా తిరుగుతారు. తొలి సినిమా ఛాన్స్ వస్తే, అల్లుకుపోవచ్చని కళలను కంటారు. కానీ కొందరికి ఎంతప్రయత్నం చేసిన కల్సి రాదు. కొందరికి యిట్టె కల్సి వచ్చేస్తుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ ని తీసుకుంటే వాళ్లకు తొలిసినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. శతమానం భవతి మూవీతో అలరించిన అనుపమ పరమేశ్వరన్ వెరైటీగా హీరోయిన్ అయిపొయింది. అసలు అనుపమకు సినిమాల్లోకి పంపడం ఇంట్లో వాళ్ళకి సుతరామూ ఇష్టం లేదట. ఈ అల్లరమ్మాయి ఇంట్లో వెల్లగల్లు కప్పి తన ఫోటోలను మళయాళం లో తీసిన ప్రేమమ్ సినిమా ఆడిషన్స్ కి పంపించింది.
Anupama parameshwaran
ఇలా పంపిందో లేదో అలా సెలెక్ట్ అయిపోవడంతో ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది. మొత్తానికి ఆ సినిమాలో వేషం కట్టాక ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లేకుండా స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఇక రాశికన్నా విషయానికి వస్తే, ఆమె కాలేజ్ డేస్ లో వాజిలిన్ కంపెనీ వారు కాలేజీలో నిర్వహించిన ఫోటో షూట్ లో పాల్గొన్న వాళ్లకు ఓ వాజిలిన్ ఫ్రీగా ఇస్తామన్నారట. ఫ్రీగా వాజిలిన్ వస్తుందని రాశీఖన్నా అందులో పార్టిసిపేట్ చేసిందట.

అలా తీసిన ఫోటోని వాజిలిన్ కంపెనీ వారు ఆన్ లైన్ లో పెట్టారు. దీన్ని ఓ మ్యాగజైన్ వాళ్ళు ఆ ఫోటోని కవర్ పేజీగా వేసేసారు. ఈ ఫోటో చూసిన పలు కంపెనీలు తమ ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని క్యూ కట్టాయి. ఇక అలా సినీ రంగ ప్రవేశం అయింది. తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్ గా వేషం కట్టి స్టార్ హీరోయిన్ అయిపోయింది.

కాగా మహానటి సినిమాతో ఎవరెస్టు ఎత్తుకి ఎదిగిన కీర్తి సురేష్ చిన్ననాటి నుంచి తన తల్లి మేనకాని చూస్తూ హీరోయిన్ అవ్వాలని కలలు కనేదట. ఎందుకంటే చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా వేసింది. అయితే సినిమాలు వద్దు,ముందు చదువు పూర్తిచేయమని మెలిక పెట్టడంతో గత్యంతరం లేక స్టడీస్ కొనసాగించింది. ఆతర్వాత మళయాళంలో గీతాంజలి మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మహానటి అయింది.

చిన్నప్పటినుంచి బాడీని మెలికలు తిప్పుతూ డాన్స్ లు చేసే సాయిపల్లవి అనేక టివి షోలలో ,డాన్స్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంది. అయితే సినిమా ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చినా సరే,ముందు డాక్టర్ అయ్యాకే యాక్టర్ అంటూ పట్టా చేతికి వచ్చేవరకూ ఆగిమరీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఫిదా అయ్యేలా చేసింది. ఇక చిన్న తనం నుంచి బొద్దుగా ఉండే మెహరీన్ గౌర్ అందం విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టేది కాదు. బాల్యం అంతా ఇండియాలో గడిపిన ఈమె ప్లస్ టు స్టడీ అయ్యాక సౌత్ ఆఫ్రికా వెళ్లిపోయారు.

లుక్స్ పట్ల శ్రద్ధ వహించి సన్నాబడాలని ఇంట్లో వాళ్ళు ఎంతచెప్పినా పట్టించుకునేది కాదు. ఇక లాభం లేదని ,తనకూతురికి పెళ్లి కాదని భావించి ఆమె తల్లి దక్షిణాసియా అందాల పోటీలో కూతురిని పార్టిసిపేట్ చేయించింది. దీంతో తప్పదురా అన్నట్లు సన్నబడడానికి చేసిన ప్రయత్నం ఫలించి, పోటీలో విజేతగా నిలిచింది. దీంతో అనేక కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్ గా చేసాయి. ఇలా మోడల్ గా బిజీగా ఉంటూనే, నాని సరసన కృష్ణగాడి వీరప్రేమ గాథ లో నటించి,బిజీ స్టార్ అయింది.