Movies

సుందరం మాస్టర్ జీవితంలో జరిగిన ఈ సంఘటనలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… నమ్మలేని నిజాలు

సినిమా ఇండస్ట్రీలో హీరోలకే కాదు,హీరోయిన్స్,కేరక్టర్ నటులు,టెక్నీషియన్స్ ఇలా అన్ని విభాగాల్లో వారసత్వం ఉంది. సినిమాలో డాన్స్ కి కూడా ప్రత్యేక స్థానం ఉండడంతో వారసులు అదే పంధాలో కొనసాగుతున్నారు. ఇందులో ముఖ్యంగా సుందరం మాస్టర్ ఒకరు. డాన్స్ లో ఈయన లెజెండ్ గా చెబుతారు. ఈయన కొడుకుల్లో ప్రభుదేవా గురించి చెప్పాల్సి వస్తే, మెరుపు తీగలా డాన్స్ చేయడంలో దిట్ట. తెలుగు,తమిళ భాషల్లోనే కాదు ఆలిండియా లెవెల్లో ప్రభుదేవా కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. హీరోల కెపాసిటీ డాన్స్ లోనే ఉంటుంది. అలా హీరోల రేంజ్ పెరగడానికి ప్రభుదేవా కొరియోగ్రఫీ చాలా దోహదం చేసిందని చెప్పవచ్చు.

ఇక సుందరం మాస్టర్ దాదాపు అన్ని భాషల్లో కలిపి దాదాపు 1200మూవీస్ కి డాన్స్ మాస్టర్ గా పనిచేసారు. ఈయనకు ప్రభుదేవా తో పాటు,రాజ సుందరం ,నాగేంద్ర ప్రసాద్ అనే ముగ్గురు కొడుకులున్నారు. ఆనాటి అగ్ర హీరోలు ఎన్టీఆర్ ,ఏ ఎన్ ఆర్ , ఎంజీఆర్ లకు డాన్స్ కంపోజ్ చేసి , పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు తర్వాత తరంలో చిరంజీవి,వెంకటేష్,బాలకృష్ణ నాగార్జున వంటి నటులకు కూడా నృత్యరీతులను సమకూర్చారు. నిజానికి సుందరం మాస్టారు కర్ణాటక స్టేట్ లో మైసూర్ దగ్గర చిన్న గ్రామంలో ఉండేవారు. రెండో క్లాస్ తోనే చదువుకి గుడ్ బై చెప్పేసి, కుటుంబ పోషణలో భాగంగా గుడిలో శంఖం ఊదే పనిచేసేవారు.

కష్ఠాలు తెలుసున్న వ్యక్తిగా సుందరం మాస్టారు పెళ్లీడు వచ్చాక ఓ పేదింటి అమ్మాయి మహాదేవమ్మను పెళ్లాడాడు. పెళ్లి సమయానికి ఆమెకు తల్లిదండ్రులు కూడా లేరట. ఆతర్వాత చెన్నై వచ్చి వాహిని స్టూడియోలో చందమామ ప్రెస్ లో వీలర్ గా 40రూపాయలకు జాయిన్ అయ్యాడు. అక్కడ సినిమా వాళ్లతో ఏర్పడ్డ పరిచయంతో కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తాడు.

అంతకుముందు ఓ డాన్స్ మాస్టర్ దగ్గర నెలకు 10రూపాయలిచ్చి డాన్స్ నేర్చుకున్నాడు. నిజానికి డాన్స్ మాస్టర్ కన్నా సుందరం బాగా డాన్స్ చేసేవాడు. అలా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల పిచ్చి గల సుందరం మాస్టర్ అంతకు ముందు హోటల్ లో పనిచేసేవాడట. పాతాళ భైరవ మూవీ చూడ్డానికి డబ్బులు లేకపోతె హోటల్ లో డబ్బులు కొట్టేసి ఆ సినిమా చూశాడట.

ఇక ఈయన కొడుకులు ప్రభుదేవా, రాజసుందరం దేశం గర్వించదగ్గ స్థాయిలో డాన్స్ మాస్టర్ లుగా రాణిస్తున్నారు. కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవా అందరిలో బాగా రాణిస్తున్నాడు. చిన్న కొడుకు నాగేంద్ర పలు చిత్రాల్లో హీరోగా నటించాడు. ప్రభుదేవా డైరెక్షన్ విభాగంలో కూడా మెళుకువలు నేర్చుకుని ఎన్నో చిత్రాలకు డైరెక్షన్ చేసారు.

ముఖ్యంగా హిందీలో రౌడీ రాధోడ్,ఆర్ రాజకుమార్ వంటి చిత్రాలతో తన స్టైల్ ఏమిటో చూపించాడు. నిజానికి ప్రభుదేవా కు కాలేజీలో సీటు రాకపోతే ఇంటికి వచ్చి పడుకుండిపోవడంతో అప్పుడు మణిరత్నం తీసిన మౌన రాగం మూవీకి సుందరం మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. ఇక ఆరోజు ఆరుగురు డాన్సర్లలో ఒకరు రాకపోవడంతో ప్రభుదేవాను తీసుకెళ్లి డాన్స్ చేయించారు. అలా ప్రభుదేవా కెరీర్ స్టార్ట్ అయింది. ఇక సుందరం మాస్టారు సొంతూరు వెళ్లి అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. పనివాళ్ళు లేకున్నా స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ సేద్యం చేస్తున్నారు.