Politics

తెలంగాణా ఎన్నికల్లో హెలికాఫ్టర్ల జోరు ఏ రేంజ్ లో ఉందో తెలుసా?

ఎన్నికల ప్రచారం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో బహిరంగ సభలు, రోడ్డు షోలు,ఊరేగింపులు మామూలే. గతంలో కార్లలో వెలుతూ ప్రచారం సాగించేవారు. ఇప్పుడు వేగంగా ప్రచారం కోసం హెలికాఫ్టర్లు వాడుతున్నారు. తాజాగా తెలంగాణా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎక్కువగా హెలికాప్టర్లు వాడారు. ప్రచార ఘట్టం ముగియడంతో ఇక పోలింగ్ మిగిలింది. అయితే ఎవరెవరెవరు ఎన్ని హెలికాఫ్టర్లు వాడారో గానీ మొత్తానికి హోరెత్తించారు. హెలికాఫ్టర్లు అద్దెకు ఇచ్చేవాళ్ళు కూడా ఉండడంతో సగటున గంటకు 4లక్షల రూపాయల అద్దె చెల్లించి మరీ ప్రచారంలో దూసుకుపోయారు.

టి ఆర్ ఎస్ ,కాంగ్రెస్ సారధ్యంలోని ప్రజాకూటమి,బిజెపి,ఎం ఐ ఎం పోటీచేశాయి. కాంగ్రెస్ తరపున 40మంది స్టార్ ప్రచారకులు పాల్గొన్నారు. టి ఆర్ ఎస్ తరపున 16మంది స్టార్ ప్రచారకులు పాల్గొన్నారు. టిడిపి తరపున 27మంది స్టార్ ప్రచారకులు పాల్గొన్నారు. అందుకే హెలికాఫ్టర్ల జోరు బాగా కనిపించింది. ఇందుకు ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకున్నారు. టి ఆర్ ఎస్ అధ్యక్షులు కేసీఆర్ రోజుకి ఐదారు నియోజకవర్గాల్లో ప్రచారం చేసారు. ఓ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి వెళ్ళడానికి హెలికపటర్ వాడారు. అంటే రోజుకి 7గంటల చొప్పున హెలికాఫ్టర్ వాడడం ద్వారా రోజుకి 28లక్షలు అద్దె చెల్లించారు.

కాంగ్రెస్ స్టార్ కాంపైనర్ విజయశాంతి కూడా హెలికాఫ్టర్ లోనే ప్రచారం చేసారు. బిజెపి, టిడిపి నేతలు కూడా హెలికాఫ్టర్లు వాడారు . దీనివలన సమయం ఆదా అయింది. అయితే ఖర్చు ఎక్కువే. మూడు పార్టీలు కలిపి ఆరు హెలికాఫ్టర్లు వాడాయి. టి ఆర్ ఎస్ రెండు,కాంగ్రెస్ మూడు,బిజెపి ఒక హెలికాఫ్టర్ వాడాయి. టర్బో ఏవియేషన్,గ్లోబల్ వెక్ట్రా,టుంబి ఏవియేషన్ వంటి సంస్థల నుంచి అద్దెకు తీసుకుని ప్రచారం చేసారు. సీఎం లాంటి వాళ్ళు ప్రయాణించే హెలీకాఫ్టర్లో 10మంది, మిగిలిన హెలీకాఫ్టర్లలో 4నుంచి 6మంది ప్రయాణిస్తారు.

టిఆర్ ఎస్ తరపున కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు,కాంగ్రెస్ తరపున విజయశాంతి,రేవంత్ రెడ్డి,భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి,బిజెపి తరపున స్వామి పరిపూర్ణానంద హెలికాఫ్టర్లు వినియోగించారు. ఇక జాతీయ నేతలు రాహుల్,అమిత్ షా, మాయావతి వంటి నేతలు కూడా హెలీకాఫ్టర్లను వాడారు. కేసీ ఆర్ 73సార్లు హెలికాఫ్టర్ విని యోగించగా,విజాశాంతి 40సార్లు,వాడినట్లు ఇండియా టుడే ఆర్టికల్ వెల్లడించింది.