హీరో బాలాజీ గుర్తు ఉన్నాడా…టాప్ హీరోయిన్ తమ్ముడు… ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమాల్లో ఎన్నో వింతలూ ,విశేషాలు సహజం. కొందరు పైకి వస్తారు. మరికొందరు చితికి పోతారు. ఇంకొందరు మధ్యలోనే నిష్క్రమిస్తారు. ఒకప్పుడు బాలనటిగా,తర్వాత హీరోయిన్ గా, కేరక్టర్ ఆర్టిస్టుగా పనిచేసిన రోహిణి తాజాగా బాహుబలిలో ప్రభాస్ పెంపుడు తల్లిగా , కొండజాతి మహిళగా మెప్పించింది. అయితే ఆమె నటించిన భక్త్రప్రహ్లాద,యశోద కృష్ణ వంటి సినిమాలకు పిల్లాడిలా వెంటవెళ్ళేవాడు ఆమె తమ్ముడు బాలాజీ. కానీ సినిమాల్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టాక మాత్రం ఏనాడూ కూడా రోహిణి తన సోదరిగా ఎక్కడా చెప్పుకోలేదు. ఇంతకీ బాలాజీ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసుకుందాం.

కేరక్టర్ నటుడిగా రాణించిన బాలాజీ నల్లగా,స్టైల్ గా ఉండడం అందరూ అతన్ని తెలుగు రజనీకాంత్ అని అనేవారు. ఇక రజనీకాంత్ కూడా బాలాజీ మేనరిజం చూసి ‘అచ్చం నన్నే ఇమిటేట్ చేస్తున్నావే’అనేవాడట. బాలాజీ స్టైల్ చూస్తే జూనియర్ రజనీకాంత్ అనుకోవడం సహజమే. బాలాజీ సొంతూరు టూరిపోగడవారి జిల్లా తాపేశ్వరం. అయితే స్టడీస్ నెల్లూరులో చేసాడు. కాలేజీలో ఉండగానే నాటకాల్లో వేసేవాడు.

ఇక నెల్లూరులోనే మెగా బ్రదర్ నాగబాబు కూడా డిగ్రీ బిఎ చదివాడు. కాలేజీలు వేరైనా నాగబాబుకు,బాలాజీకి మంచి పరిచయం ఉంది. నాగబాబు ఇంటిపక్కనే బాలాజీ ఇల్లు ఉండేది. దీంతో నాగబాబు తో కల్సి చిరంజీవి సినిమా మొదటిరోజే చూసేసేవాడు. ఇక కాలేజీలో నాటకాల్లో వేసినపుడు తొలి బహుమతి చిరంజీవి ద్వారా అందుకున్నాడు.

జంధ్యాల డైరెక్షన్ లో వచ్చిన నాలుగు స్థంభాలాటలో ఓ చిన్న వేషం వేసిన బాలాజీ కి దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన ఓ ఆడది,ఓ మగాడు సినిమాలో సాఫ్ట్ విలన్ కేరక్టర్ ఇవ్వడంతో అసలు కెరీర్ మొదలైంది. యువరాజు చిత్రంలో బాలాజీని తీసుకున్నారు. ఇక దాసరి డైరెక్షన్ లో ఎమ్మెల్యే ఏడుకొండలు చిత్రంలో నటించాడు. ఆతర్వాత దాసరి ద్వారానే విజయ బాపినీడు చిత్రంలో ఛాన్స్ వచ్చింది. మగమహారాజు చిత్రం అది. చిరంజీవి, సుహాసిని నటించిన ఆ మూవీలో బాలాజీ కేరక్టర్ బాగానే క్లిక్ అయింది.
Rohini.
భయపడే తమ్ముడిగా చిరంజీవి పక్కన నటించిన బాలాజీ, ఆతర్వాత చెడ్డ వ్యసనాలకు బానిసగా మారి, చిరంజీవి ఎదుటే సిగరెట్ కలుస్తూ కనపడే పాత్రలో ఒదిగిపోయాడు. ఇక మంగమ్మగారి మనవడు చిత్రంలో వై విజయ వేశ్య గా నటిస్తే ఆమె తమ్ముడిగా బాలాజీ నటించి,కామెడీతో కూడిన విలనిజం చేసాడు. మోహన్ బాబు సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న బ్యానర్,అలాగే జగపతి బాబు సొంత బ్యానర్ జగపతి ఆర్ట్స్ లో లంచావతారం చిత్రాల్లో నటించాడు.

ఇక అతడే నిర్మాతగా మారి , ఘర్షణ,రుద్రుడు వంటి మూవీస్ తీసాడు. అయితే అతడు తీసిన సినిమాలు దెబ్బతినడంతో ఆర్ధికంగా బాగా నష్టపోయాడు. ఆతర్వాత బుల్లితెరపై అడుగుపెట్టిన బాలాజీ ఎండమావులు,కలవారి కోడలు, అంతరంగాలు వంటి ఎన్నో సీరియల్స్ లో నటించాడు. రాధికా తీసే రాధా మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్ లో నటించాడు. బాలాజీ తండ్రికి శోభన్ బాబు బాగా తెలియడంతో బాలాజీని పరిచయం చేసాడు.

అయితే ‘నీవు సొంతంగా ఎదుగు,నేను ఎవరికీ రికమండ్ చేయను’మొహమాటం లేకుండా శోభన్ బాబు చెప్పేశాడట. అయితే కొన్నాళ్లకే శోభన్ బాబుతో కల్సి బంధం చిత్రంలో నటించాడు. ఇక ఆతర్వాత విజయనిర్మల డైరెక్షన్ లో సోల్జర్ అనే మూవీని బాలాజీయే నిర్మించాడు. ఇక ప్రొడ్యూసర్ అవతారం ఎత్తడంతో ఎవరూ ఛాన్స్ లు ఇవ్వడం లేదు. ఇక ఆయన కొడుకు ఎం ఎస్ పూర్తిచేయడంతో హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు.