ఈ హీరోలకు ఉన్న అంగవైకల్యం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…నమ్మలేని నిజాలు

సినిమాల్లో నటించే వాళ్లలో కొన్ని లోపాలు ఉంటాయి. కానీ చాలా చాకచక్యంగా కవర్ చేస్తూ రాణించేస్తారు. బాగా గమనిస్తే తప్ప తేడా గమనించలేం. డబ్బు,హోదా, బ్యాక్ గ్రౌండ్ ఎంతున్నా సరే,కృషి పట్టుదల కూడా పుష్కలంగా ఉండాలి. ఇక లోపాల విషయానికి వస్తే అంగవైకల్యం ఉన్న హీరో హీరోయిన్స్ ఎక్కడా కన్పించకుండా నటిస్తుంటారు. అలాగే కొంతమందికి నత్తి ఉంటుంది కానీ పైకి కనిపించకుండా మేనేజ్ చేస్తారు. ఎందుకంటే ఉచ్చారణ బాగుండకపోతే ఆడియన్స్ ని మెప్పించలేరు.

ఆరోజుల్లో కత్తి కాంతారావు ని చూస్తే,ఆయనకు గల నత్తి సమస్య సినిమాల్లోకి వచ్చేవరకూ పెద్దగా ప్రాబ్లెమ్ కాలేదు. కానీ సినిమాల్లో కుదరదు కదా. అందుకే వద్దంటే డబ్బు సినిమాలో అక్కినేని తమ్ముడి పాత్రలో ఎంపికైన కాంతారావుకి నత్తి ఉందన్న విషయం ప్రొడ్యూసర్ హెమ్ ఎం రెడ్డి పసిగట్టి,వైద్యం చేయించి మెరుగుపరిచారు. దాంతో నత్తి పూర్తిగా తగ్గిపోయి జానపద ,పౌరాణిక చిత్రాల హీరోగా ఖ్యాతిగాంచారు.

ఇక ఇండస్ట్రీలో కమెడియన్ గా వెలుగొందుతున్న అలీకి చిన్నప్పుడు నత్తి ఉండేదట. అయితే పట్టుదలగా కృషిచేసి ,మాటలు బాగా ప్రాక్టీస్ చేస్తూ నత్తిని అధిగమించాడు.

ఇక యాంగ్రీ హీరో డాక్టర్ రాజశేఖర్ ఇప్పటికీ కూడా మాట్లాడుతుంటే తడబాటు ఉంటుంది. ఇక ఓ స్టేజిపై తన నత్తిని ప్రస్తావిస్తూ,తాను ఓ దివ్యంగుణ్ణి అంటూ చెప్పుకొచ్చి,కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమాల్లో చేరిన కొత్తలో ప్రొడ్యూసర్ పోకూరి బాబురావు అయితే డాక్టర్ రాజశేఖర్ నత్తి కారణంగా సినిమాల్లోకి పనికి రాడని అన్నారట. ఆ విషయాన్ని ఆయన పలుసార్లు ప్రస్తావించారు.

ఇక హీరో నితిన్ కి కొంత నత్తి వుంది. అది ఎక్కడ తెల్సిపోతుందోనని భయపడేవాడు. అందుకే హీరో శివాజీ అతనికి మొదట్లో డబ్బింగ్ చెప్పేవాడు. అయితే ఎవరో డబ్బింగ్ చెప్పడమేమిటని కష్టపడి కృషి చేసి తానె డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు.

నందమూరి బాలకృష్ణ తెలుగు భాషా ప్రావిణ్యం చూపిస్తుంటారు. అయితే మధ్య మధ్యలో తడబడుతూ అభాసుపాలవ్వడం లైవ్ లో చాలా చాలామంది తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ హృత్రిక్ రోషన్ కూడా నత్తి సమస్యతో బాధపడేవాడట. చిన్నప్పుడు అంటే 6ఏళ్ళ వయసులో ఈ సమస్య పక్క వాళ్లకు ఎక్కడ తెల్సిపోతుందేమోనని భయపడేవాడట. ఎందుకంటే నత్తిగా మాట్లాడ్డం చూసి సాటి పిల్లలు ఏడిపించేవారట. ఇక పరీక్షలు రాయాలన్న భయం వేసేదట. ఇక ఇప్పటికీ కూడా తన లోపం బయట పడుతూ ఉంటుందని చెప్పుకొచ్చాడు.