ఉదయ్ కిరణ్ ,చిరంజీవి మధ్య ఏం జరిగిందో తెలుసా…. నమ్మలేని నిజాలను బయట పెట్టిన ఉదయ్ కిరణ్ అక్క
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా స్వశక్తితో నిలదొక్కుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరికి ఎంత సపోర్ట్ ఇచ్చినా ఎదగలేరు. టాలెంట్ ఉండాలి,అదృష్టం ఉండాలి. ఏది లేకున్నా ఫిలిం ఇండస్ట్రీలో కష్టమే. అయితే ఉదయ్ కిరణ్ స్వశక్తితో ఎదిగాడు. కెరీర్ లో మంచి హిట్స్ కొట్టాడు. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణంపై అనేక అనుమానాలు,కధనాలు వస్తూనే ఉన్నాయి. కానీ అసలు నిజం ఉదయ కిరణ్ సోదరి శ్రీదేవి వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.
వరుస సినిమాలతో హిట్స్ తో కొడుతూనే ప్రేమ, నిశ్చితార్ధం,బ్రేక్ అప్ నేపథ్యంలో సినీ పరిశ్రమలో నిలదొక్కుకోడానికి ఉదయ్ కిరణ్ ప్రయత్నాలు సాగించాడు. అయితే పరిస్థితులు చేజారడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని సోదరి శ్రీదేవి ఓ ఇంటర్యూలో చెప్పిన మాటలు వింటే షాక్ అవుతాం. ‘ఉదయ్ కి ఆర్ధిక సమస్యలు లేవు. ప్రతి పైసా అతడి వద్దే ఉంచుకున్నాడు.
నా దగ్గర కానీ, నాన్న దగ్గర గానీ లేవు. సినిమా ఛాన్స్ లు లేకున్నా ఉదయ్ కి ప్రాబ్లమ్ లేదు. అయితే ఆత్మహత్యకు కారణం మాత్రం లెలియడం లేదు’అని ఆమె చెప్పింది.అయితే నా తమ్ముడి మరణం వెనుక అనుమానాలున్నాయి. నాతొ ఎప్పుడూ సరదాగా మాట్లాడేవాడు. సమస్యలు అసలు చెప్పేవాడు కాదు. మరణానికి ముందు జనవరి 1న నాతొ మాట్లాడాడు. సినిమాల్లో పుంజుకుంటానని చెప్పేవాడు. అయితే జనవరి 4న ఆత్మహత్య చేసుకోవడం ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాం.
ఉదయ్ కిరణ్ తొలి బ్రేక్ అప్ తర్వాత చిరంజీవి బాగా హెల్ప్ చేస్తూ,గాడ్ ఫాదర్ గా ప్రోత్సహించాడు. కెరీర్ పై బాగా దృష్టి పెట్టడంతో కూతురిని ఇవ్వడానికి ప్రతిపాదన తెచ్చారు. నేను,ఉదయ్ వెళ్లి,మాట్లాడాకా, పెళ్ళికి ఒప్పుకున్నారు. చిరంజీవి చాలా సార్లు మనసు విప్పి మాట్లాడిన చిరంజీవి మంచి వ్యక్తి’అని ఆమె కంట తడి పెట్టారు.
నిజానికి చిరు కూతురు నిశ్చితార్ధం తరవాత ఇద్దరూ చాలా బాగా ఉన్నారు. అయితే అంతరాల్లో గ్యాప్ కనిపించింది. ఉదయ్ సింపిల్ గా ఉండేవాడు. చిరు కూతురు సంపన్నురాలు. ఉదయ్ చిన్న కుటుంబం నుంచి రావడంతో ఇద్దరి మధ్యా విబేధాలు బాగా పెరిగిపోయాయి. దీంతో చిరు దగ్గరకు వెళ్లి ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు చాలా ఉన్నాయని, జీవితంలో ముందుకి వెళ్లడం కాశమని చెప్పేసాడు. దీంతో చిరు బాగా ఆలోచించి ఇద్దరి అంగీకారంతో నిశ్చితార్ధం రద్దు చేసారు’అని శ్రీదేవి చెప్పింది.