Movies

అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబును ఆదుకున్నది ఎవరు… ఇప్పుడే బయటపడిన నమ్మలేని నిజం

స్వయం కృషితో పైకి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇక చిరంజీవిని ఆధారం చేసుకుని మెగా ఫ్యామిలీలో ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగుతున్నారు. నాగబాబు, పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్, రామ్ చరణ్,వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్,అల్లు శిరీష్ వరకూ ఎందరో మెగాస్టార్ సామ్రాజ్యాన్ని ఆలంబనగా చేసుకుని వచ్చినవాళ్లే . ఇక ఇందులో నాగబాబు హీరో కాదు, పూర్తిగా ప్రొడ్యూసర్ కూడా కాదు. ఈయనది డిఫరెంట్ స్టైల్.

కేరక్టర్ రోల్స్ చేస్తూ,ఈటివి జబర్దస్త్ లో జడ్జిగా రాణిస్తున్న నాగబాబు ఒకప్పుడు రుద్రవీణ,బావగారు బాగున్నారా సినిమాలు తీసి ,హిట్స్ కొట్టాడు. అయితే రామ్ చరణ్ తో తీసిన ఆరెంజ్ మూవీ దారుణంగా దెబ్బకొట్టింది. అయితే అనుకున్న దానికన్నా ఈ సినిమాకు ఎక్కువ ఖర్చయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువ అయింది. దాంతో అధికంగా నష్టాలు రావడంతో ఆస్తులు అమ్మేసినా అప్పులు తీరని దుస్థితి వచ్చేసింది.

ఇక కారు కూడా చేతిలో లేకుండా పోవడంతో చిరంజీవి,పవన్ కళ్యాణ్ చేయూతనిచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి ఎంత అప్పయినా కేట్టేస్తా అంటూ సొందరుడి ముఖంలో సంతోషం వెల్లివిరిసేలా చేసాడు. దీంతో చిరంజీవి కూడా ముందుకొచ్చి ఆదుకున్నాడు. నిజానికి రక్త సంబంధీకులు కన్నా ఫ్రెండ్స్ ఎక్కువ అని అనడం వింటుంటాం.

అయితే పవన్, చిరంజీవిలను చూసాక అన్నదమ్ములే బెటర్ తనని నాగబాబు ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. ‘ఆరెంజ్ సినిమాకు బడ్జెట్ ఎక్కువ కావడం వలన దెబ్బ తిన్నాను. సోదరుల మీద ఆధార పడకుండా సొంతంగా నిలబడే యత్నం చేశాను. నిజానికి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడకుండా ఒక రకంగా యుద్ధమే చేశాను. అందుకే టివి రంగంలో సక్సెస్ అయ్యాను’అని నాగబాబు ఆ ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు.