Movies

మహానటుడు ఎస్ వీ రంగారావు షూటింగ్ అయ్యాక ఎన్ని ఇబ్బందులు పెట్టేవారో తెలుసా?

ఏ పాత్రనైనా అవలీలగా పోషించి మెప్పించడంలో మహానటుడు ఎస్వీ రంగారావు దిట్ట. సెట్ లో డైలాగ్ ని కూడా మార్చేసి మెప్పించగల మహానటుడు. అభినయంలో అతనికి అతడే సాటి. ఎస్వీఆర్ లాంటి మహానటుడు రాడు,పుట్టడు అని ఘంటాపధంగా చెప్పొచ్చు అయితే అందరినీ ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయట. ఆయన సమకాలికులు చెప్పే దాన్ని బట్టి, మహానటుడైనా ఎస్వీఆర్ కి మందు మీద ధ్యాస కలిగిందట. ఎలా ఉంటుందో రుచి చూసాక బానిస అయ్యాడు. క్వార్ట్రర్ బాటిల్ నుంచి ఫుల్లు మీద ఫుల్లు బాటిల్స్ లాగించే స్థాయికి వచ్చేసాడు.

ఇలా తాగుడు వలన షూటింగ్ లకు రాకపోవడం,మత్తులో జోగడంతో చాలామంది ఫోన్స్ చేస్తే,ఇంకాలేవలేదనే సమాధానం వచ్చేది. మూడురోజులు సినిమాలకు ఎస్వీఆర్ రారని అందుకే షూటింగ్ కేన్సిల్ చేద్దామని ఓ ప్రొడ్యూసర్ అన్నారట. తమిళ చిత్రాలకు కూడా హాజరవ్వడం లేదని తెలుసుకుని ఇక అతనిస్తే పడలేమని భావించారట. సుందర రాజన్ అనే డ్రామా ఆర్టిస్ట్ ని పట్టుకున్నారట.

సుందర రాజన్ అచ్చం ఎస్వీఆర్ లానే నటించగలడని తీసుకొచ్చారట. కానీ ఎస్వీఆర్ లేని లోటు అలానే ఉండేది. ఇక 15రోజులు మందులోనే ఉండడం వలన ఎస్వీఆర్ ని పట్టుకోవడం కష్టమయ్యేదట. మందు తాగి సెట్ కి రావడం లేదు. మత్తు తిగాకే వచ్చేవాడు. అయితే తెలుగు ప్రొడ్యూసర్స్ అందరూ కల్సి విలన్ గా పైకి వస్తున్న కైకాల సత్యనారాయణ ను ప్రత్యామ్నాయంగా చూసుకున్నారట.

అలా సత్యనారాయణ నిలదొక్కుకున్నాడు. ఎస్వీఆర్ నిండైన విగ్రహం చూస్తే,నిజంగా కంసుడే, నిజంగా హిరణ్య కశ్యపుడే,దుర్యోధనుడే, కీచకుడే అని జనం చెప్పుకునేవారు. అంతలా ఆయన నటన చూపేవారు. అయితే ముందుకి బానిసగా మారిపోయి,కెరీర్ పాడుచేసుకుని,54ఏళ్లకే ఈలోకం నుంచి నిష్క్రమించారు.