గీత గోవిందం’ సినిమాలోని ఈమెని గుర్తుపట్టారా..? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా..? ఈమె నటి కాక ముందు ఏమి చేసేదో?

సినిమాల్లో ఛాన్స్ లు ఎప్పుడు ఎవరికీ ఏ రూపంలో వస్తాయో తెలీదు. కొందరు డైరెక్టర్ల చుట్టూ,ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగినా ఛాన్స్ లు రావు. ఇలా ఛాన్స్ లు రానివాళ్లు చాలామందే ఉంటారు. కానీ ఎలాంటి ప్రయత్నం లేకుండా నేరుగా కొందరికి ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఇక వయస్సుతో అసలు సంబంధం ఉండదు. వరుస ఛాన్స్ లతో దూసుకుపోతారు. అలా వచ్చిన నటి కళ్యాణి నటరాజన్. ఈమె ఇద్దరు కొడుకుల తల్లిగా 40ప్లస్ లో ఇండస్ట్రీకి వచ్చి తన హవా సాగిస్తోంది. అయితే టీనేజ్ లో ఛాన్స్ వచ్చి ఉంటే ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసేదని స్వయంగా ఆమె తల్లే అన్నారంటే ఈమె టాలెంట్ గురించి చెప్పక్కర్లేదు.

ఇంతకీ కళ్యాణి ఎవరంటే తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈమె ముంబయిలో పెరిగింది. ఇంగ్లీష్ లో లిటరేచర్ అయ్యాక స్కూల్ టీచర్ గా చేసేది. అయితే రాత్రికి రాత్రే నటి అయిపొయింది. అయితే ముంబయిలోని తమిళ థియేటర్స్ ఆర్ట్స్ లో ఎన్నో నాటకాల్లో సరదాగా వేషం కట్టింది. ఇది చూసిన ఓ కమర్షియల్ యాడ్ ఏజన్సీ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి,తాము సౌత్ ఇండియా మహిళ కోసం వెతుకుతుంటే కళ్యాణి ఓ అదృష్ట దేవతలా కనిపించిందని చెప్పారట.

కమర్షియల్ యాడ్ లో నటించాలని కోరడంతో అలా కళ్యాణ్ సిల్క్స్ ,ఒడొనిల్ బాత్రూం ఎయిర్ ఫ్రెషనర్,వంటి ఎన్నో యాడ్స్ లో దూసుకుపోయింది.
ఇక తమిళ సినిమా సత్తై మూవీతో వెండితెరపై నటించే ఛాన్స్ కొట్టేసింది. విజయ్ నటించిన ఈ సినిమాలో ఈమె పాత్ర చిన్నదే అయినా గుర్తింపు బాగా వచ్చింది.

వరుస ఛాన్స్ లు దక్కించుకున్న ఈమె మహానుభావుడు మూవీలో హీరో శర్వానంద్ తల్లిగా నటించింది. డిక్టెటర్ ,రెమో,శైలజా రెడ్డి అల్లుడు,గీత గోవిందం వంటి మూవీస్ లో తల్లి పాత్రల్లో అద్భుతంగా మెప్పించింది. ఇలా ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చి ,వరుస సినిమాలతో దూసుకుపోతోంది.