Movies

ఈ టాప్ హీరోయిన్ ని గుర్తు పట్టారా….ఇప్పుడు ఎక్కడ ఎలా ఉందో…ఏమి చేస్తుందో తెలుసా?

పదేళ్ల వయస్సులో ఓ ఆంగ్లచిత్రంలో నటించిన కేరళ కుట్టి నిత్యామీనన్ పెద్దాయ్యాక హీరోయిన్ గా అవతారం ఎత్తి స్టార్ హీరోయిన్ అయింది. తెలుగు,తమిళ , కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. మహానటి లో ఛాన్స్ వచ్చినా కాదనడంతో కీర్తి సురేష్ ని ఎంపికచేశారు. దీంతో నిత్యా ఓ మంచి ఛాన్స్ మిస్సయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంగ్లీషు మూవీలో టబు చెల్లెలుగా నటించిన ఈమె ఆతర్వాత 7ఓ క్లాక్ మూవీలో లీడ్ రోల్ పోషించింది. 1988ఏప్రియల్ 8న జన్మించింది. ఈమె పేరెంట్స్ కేరళకు చెందినవారు. తండ్రి సొంతూరు కాలికట్ అయితే,తల్లి స్వస్థలం పాలక్ కట్. అయితే తల్లిదండ్రులు బెంగళూరులో సెటిల్ అవ్వడంతో ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడే నడిచింది.

అలా మొదలయ్యింది సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన నిత్యా మంచి గాయని కూడా. ఎన్నో సినిమాల్లో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక డిగ్రీ చదివే రోజుల్లో ఎక్స్ కర్షన్ కి వెళ్లడంతో పూణేలో డైరెక్టర్ నందిని రెడ్డితో పరిచయం ఏర్పడింది. అలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి వీలైంది.అలా మొదలైయింది మూవీతో నాని పక్కన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ లో మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.

ఆతర్వాత నితిన్ తో ఇష్క్ మూవీలో నటించడంతో బ్లాక్ బస్టర్ అయింది. కేవలం రెండు చిత్రాలతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చేసుకున్న నిత్యా కు ‘గుండె జారి గల్లంతయింది’,సన్నాఫ్ సత్యమూర్తి, వంటి సినిమాలు జనం దగ్గరకు చేర్చాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సరసన జనతా గ్యారేజ్ మూవీతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకుంది. నిజానికి ఈమె పొట్టిగా ఉండడం వలన ఈమె హీరోయిన్ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. హెవీ హీల్స్ ధరించి కవర్ చేస్తోంది.

అయితే ఒక్కోసారి హీరో హైట్ కి సరిపోకపోవడంతో కొన్నిసార్లు ప్రత్యేకంగా టేబుల్స్ వేసి మరీ హీరో హైట్ తో మేనేజ్ చేస్తున్నారట. సింగర్ గా కూడా ఎన్నో పాటలు పాడిన నిత్యా మళయాళంలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది. మూలాలు కేరళ అయినా కన్నడ అమ్మాయినని చెప్పే నిత్యా, భవిష్యత్తులో కూడా కేరళ వెళ్ళడానికి ఇష్టపడదట. ఇక ఏ కమర్షియల్ సినిమాలకు కాకుండా పాత్ర ప్రాధాన్యత గల సినిమాలను ఒప్పుకునే నిత్యా మహానటి మూవీని ఎందుకు వదులుకుందో ఆమెకే తెలియాలి.