చిరంజీవి జీవితంలో సరిదిద్దుకోలేని 10 తప్పులు ఇవేనా.?
టాలీవుడ్ లో టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాను నటించిన సినిమాలతో అభిమానులనే కాకుండా సగటు సినీ ప్రేక్షకుణ్ణి కూడా మెప్పించారు. చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే. తన డాన్స్,ఫైట్స్,డైలాగ్ డెలివరీతో అందరిని ఆకట్టుకున్నాడు. చిరంజీవి సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులు పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి భారీ పూలమాలలు వేసి పటాసులు కాలుస్తూ పాలాభిషేకాలు చేస్తూ నానా హంగామా చేసేస్తూ ఉంటారు.
అలాంటి చిరంజీవి అయన జీవితంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసారని….ఆ తప్పులు కనుక చేయకుండా ఉంటే చిరంజీవి ఎక్కడో ఉండేవారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చిరు ఏమి తప్పులు చేశాడా అని ఆలోచనలో పడ్డారా? ఆ వివరాల్లోకి వెళదాం.
1. శివ శంకర వరప్రసాద్ గా చెన్నైలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుండి డిప్లొమో పొందాక 1978 లో మొదటి సినిమాగా ‘పునాది రాళ్లు’ సినిమాలో నటించాడు. అయితే దాని కన్నా ముందు ప్రాణం ఖరీదు సినిమా విడుదల అయింది. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలను,విలన్ పాత్రలను పోషించాడు. కెరీర్ ప్రారంభంలో చిరుకి అన్ని అవకాశాలు రావటానికి కారణం తమ్మారెడ్డి భరద్వాజ్ అని తెలుస్తుంది. ఆ తర్వాత తన గురువు దాసరి నారాయణరావు గారిని ఎదిరించి తనకు తానే శత్రువులను తయారుచేసుకున్నారని టాక్ ఉంది. అయితే దీని వలన చిరు కెరీర్ కి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా చిరుకి ఒక వ్యతిరేక వర్గం ఏర్పడింది.
2. 1983 లో ఖైదీ తర్వాత మూడు సంవత్సరాల పాటు ఒక హిట్ లేని చిరంజీవి చంటబ్బాయ్,ఛాలెంజ్,శుభలేఖ వంటి సినిమాలతో పుంజుకున్నాడు. ఆ తర్వాత చిరు చేసిన సినిమాల కారణంగా మాస్ హీరోగా ముద్ర పడింది. మాస్ ఇమేజ్ లోనుంచి బయటకు రాకపోవటం వలన చిరులోని పూర్తీ స్థాయి నటుడిని చూడలేకపోతున్నాం.
3. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరు స్టార్ హీరోగా నిలదొక్కుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను చిరు సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అయ్యాడు. దాంతో కొన్ని పరాజయాలను ఎదుర్కోవలసి వచ్చింది.
4. చిరు చిన్న కూతురు శ్రీజ పెళ్లి విషయంలో ఎన్ని ట్విస్ట్స్ వచ్చాయో మనకు తెలిసిందే. ఆ సమయంలో చిరు శ్రీజ కోరుకున్న వాడితో పెళ్లి జరిపించి ఉంటే పరిస్థితి చేజారిపోయేది కాదనే మాటలు వినపడ్డాయి.
5. చిరంజీవి సుప్రీం హీరోగా అయ్యాక తన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ కెరీర్ పై ద్రుష్టి పెట్టి అన్నగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పటికీ, పవన్,నాగబాబు కెరీర్ ని నిలబెట్టటంలో విఫలం అయ్యాడనే వార్తలు చాలానే ఉన్నాయి.
6. మెగాస్టార్ జీవితంలో అతి పెద్ద తప్పు రాజకీయాల్లోకి అడుగు పెట్టటం. చిరు రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే ఇప్పుడు ఉన్న క్రేజ్ కంటే డబుల్ ఉండేదని చాలా మంది అభిప్రాయ పడుతూ ఉంటారు.
7. ప్రజారాజ్యం పార్టీతో ప్రజలలోకి వచ్చిన చిరు అనుకున్న స్థానాల్లో విజయం సాధించలేకపోయిన, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా కొంతకాలం వేచి ఉంటే చిరుకి మంచి ప్రతిఫలం దక్కేదని కొందరు అభిమానులు అంటున్నారు.
8. రాజకీయాల కోసం సినిమాలను వదులుకున్నాడు చిరంజీవి. దాదాపుగా పది సంవత్సరాల పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉండటం కూడా తప్పేనని అభిమానులు అంటున్నారు.
9. తెలుగు ప్రజలను నయవంచన చేసిన కాంగ్రెస్ లోకి చిరు వెళ్ళటం మెగా అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదట.
10. బుల్లితెరలో ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి హోస్ట్ గా ముందు నాగార్జున వ్యవహరించాడు. ఆ తర్వాత వచ్చిన చిరు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దాంతో హోస్ట్ గా వ్యవహరించటం చిరు తప్పులలో ఒకటిగా అభిమానులు భావిస్తారు.