పవన్ వదిలిలేసిన సినిమాలతో వీళ్ళు ఎంత పెద్ద హీరోలు అయ్యారో తెలుసా?
సినీ రంగంలో ప్రతి నటుడికి హిట్,ప్లాప్ అనేవి రావటం సహజమే. కథలను స్టార్స్ వినేటప్పుడు కొన్ని తప్పుల కారణంగా వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆలా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో నటించిన హీరోలు స్టార్ హీరోలుగా మారారు.
ఇడియట్
కథను పూరి జగన్నాథ్ మొదట పవన్ కళ్యాణ్ కి చెప్పాడు. కానీ పవన్ నో చెప్పటంతో పూరి రవితేజ దగ్గరకు వెళ్ళాడు. రవితేజ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని హీరోగా మారాడు. ఈ సినిమా 2002 లో విడుదల అయింది. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్ తో రవితేజ హీరోగా తన ప్రస్థానాన్ని సక్సెస్ గా సాగిస్తున్నాడు.
అమ్మ నాన్న తెలుగు అమ్మాయి
ఈ సినిమా కథను కూడా ముందుగా పవన్ కళ్యాణ్ కి చెప్పాడు పూరి జగన్నాథ్. పవన్ కళ్యాణ్ తిరస్కరించడంతో రవితేజ చేసాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా 2003 లో విడుదల అయింది.
అతడు
ఈ సినిమా కథ కూడా మొదట పవన్ దగ్గరకి వెళ్ళింది. పవన్ నో చెప్పటంతో మహేష్ దగ్గరకు వెళ్ళింది. 2005 లో విడుదల అయినా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.
పోకిరి
ఈ సినిమా కథ కూడా ముందుగా పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది. పవన్ నో చెప్పటంతో మహేష్ చేతిలోకి వెళ్ళింది. ఈ సినిమా ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. పోకిరి సినిమా 2006 లో విడుదల అయింది.
గజని
ఈ సినిమా కథను ముందుగా పవన్ చెప్పాడట. అయితే ఈ సినిమాలో గుండు చేయించుకోవాలని చెప్పటంతో పవన్ నో చెప్పేసాడు. ఆ తర్వాత ఈ సినిమా సూర్య చేతిలోకి వెళ్లి ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమా 2008 లో విడుదల అయింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు పవన్ కళ్యాణ్ ని అడిగారు. పవన్ నో చెప్పటంతో మహేష్ దగ్గరకు రావటం మహేష్ వెంటనే ఓకే సెహెప్పేయటం సినిమా హిట్ అవ్వటం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమా 2013 లో వచ్చింది.