Movies

టాలీవుడ్ లో సినిమా పేరే ఇంటి పేరుగా ఫేమస్ అయిన నటులు…ఎంత మంది ఉన్నారో చూడండి

సినిమా హీరో లేదా హీరోయిన్ కి సంబందించిన విషయాలు అంటే ప్రతి అభిమానికి ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన నటుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా పేరే ఇంటి పేరుగా ఫేమస్ అయిన నటుల గురించి తెలుసుకుందాం

అల్లరి నరేష్
అల్లరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నరేష్ కి ఆ సినిమాయే ఇంటి పేరుగా మారిపోయింది. నరేష్ ప్రముఖ దర్శకుడు E.V.V.satyanarayana కుమారుడు. కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

వెన్నెల కిషోర్
వెన్నెల సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ లో స్టార్ హీరోలతో కలిసి నటించి అముఞ్చి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.

చిత్రం శ్రీను
చిత్రం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీను చిత్రం శ్రీనుగా మారిపోయాడు.

సత్యం రాజేష్
సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాజేష్ ఇంటి పేరు సత్యంగా మారిపోయింది.

శుభలేఖ సుధాకర్
శుభలేఖ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుధాకర్ కి శుభలేఖ ఇంటి పేరుగా మారిపోయింది.

దిల్ రాజు
దిల్ సినిమా పేరు రాజు ఇంటి పేరుగా మారిపోయింది.

బొమ్మరిల్లు భాస్కర్
డైరెక్టర్ గా బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ ఇంటి పేరు బొమ్మరిల్లుగా మారిపోయింది.

ఆహుతి ప్రసాద్
ఆహుతి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రసాద్ ఇంటి పేరు ఆహుతిగా మారిపోయింది.

సాక్షి రంగారావు
సాక్షి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రంగారావు సాక్షి రంగారావుగా మారిపోయారు.

మహర్షి రాఘవ
మహర్షి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రాఘవ మహర్షి రాఘవగా మారిపోయారు.