MoviesTollywood news in telugu

రాజమౌళి కుటుంబంలో ఎంత మంది సినీ పరిశ్రమను ఏలుతున్నారో తెలుసా?

Tollywood director Rajamouli:సినిమా ఇండస్ట్రీ అనగానే ఆ నాలుగు కుటుంబాలే అని అంటుంటారు. అక్కినేని ఫామిలీ, మెగా ఫామిలీ,ఎన్టీఆర్ ఫామిలీ,సూపర్ స్టార్ కృష్ణ ఫామిలీ ఇలా నాలుగు కుటంబాల చేతిలోనే ఉందనేమాట తరచూ వింటుంటాం. కానీ మిగతా ఫామిలీ లు కూడా బానే నిలదొక్కుకున్నాయి. ఆయా విభాగాల్లో కొన్ని కుటుంబాలు కనిపిస్తాయి. అందులో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఫామిలీ కూడా బలంగానే ఉందండోయ్. ఏకంగా 13మంది రాజమౌళి ఫామిలీ వాళ్ళు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఏదైనా టాలెంట్ ప్రధానం. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఎంతున్నా టాలెంట్ లేకపోతె ఇంటికి పోవాల్సిందే

ఇక అందరికన్నా రాజమౌళి కుటుంబంలో ఎక్కువ స్టార్స్ ఉన్నారని తేలింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి రచయిత. రాజమౌళి తీసే సినిమాలకు ఆయనే రైటర్. ఇక కీలకమైన సంగీతం అందించేది కూడా రాజమౌళి బంధువు ఎం ఎం కీరవాణి. పలుభాషల్లో స్టార్స్ కి మ్యూజిక్ సమకూర్చే కీరవాణి అన్నయ్య అవుతాడు.

ఇక అలా మొదలైంది,ఊహలు గుసగుసలాడే,వంటి మూవీస్ ని మ్యూజికల్ హిట్స్ గా నిల్పిన కళ్యాణ్ మాలిక్ కూడా రాజమౌళికి అన్నయ్యే. అయితే,అనుకోకుండా ఒకరోజు,సాహసం,ప్రయాణం,ఒక్కడున్నాడు వంటి వినూత్న సినిమాలను తీసిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి స్వయంగా రమా రాజమౌళికి మేనమామ కొడుకు.చంద్రశేఖర్ యేలేటి స్వయంగా గుణ్ణం ఊర్మిళకు అన్నయ్య . ఇక ప్రఖ్యాత దర్శకుడు గుణ్ణం గంగరాజు భార్యే ఊర్మిళ. ఇక ఈమె లిటిల్ సోల్జియర్స్,అయితే,యమదొంగ వంటి మూవీస్ కి ప్రొడ్యూసర్ కూడా.

అంతేకాదు రమా, వల్లీలకు ఊర్మిళ కజిన్. ఇలా వీరి కుటుంబంలో రాజమౌళి,చంద్రశేఖర్ యేలేటి,గుణ్ణం గంగరాజు ఇలా ముగ్గురు డైరెక్టర్లున్నారు. రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డైజనర్ గా, కొడుకు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంటే,ఇక కీరవాణి భార్య వల్లీ కూడా ప్రొడ్యూసర్ గా ఉంటున్నారు. ఇక మహిళా సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా టాలీవుడ్ లో అందరికీ సుపరిచితురాలు.

దీంతో కీరవాణి,కళ్యాణ్ మాలిక్,శ్రీలేఖ ఇలా ముగ్గురు సంగీత దర్శకులు ఒకే కుటుంబం వారు. అలాగే కీరవాణి కొడుకు భైరవ సింగర్ గా,మరో కొడుకు సింహ నటుడిగా సెటిల్ అవుతున్నారు. యమదొంగ ప్రొడ్యూసర్ చెర్రీ కూడా రాజమౌళి ఫామిలీ మెంబర్. సన్ సైన్ హాస్పిటల్ చైర్మన్ కూతురు కావ్య లిటిల్ సోల్జియర్స్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా వేసింది. ఈమె రాజమౌళికి కోడలు వరస అవుతుంది.