కృష్ణ గారి సంపాదనలో ఎక్కువ భాగం ఎవరికి పంచాడో తెలుసా…ఎవరెవరికి ఎంత ఇచ్చారో తెలుసా!
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వారు ఎవరు లేరు. ఎన్నో విభిన్నమైన పాత్రలు, ఎన్నో గొప్ప సినిమాల్లో నటించిన ఘనత ఉంది. అయన హీరోగానే కాకుండా పద్మాలయ స్టూడియో ద్వారా ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు. కృష్ణ నటుడిగానే కాకుండా నిర్మతగా కూడా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అయన సంవత్సరం పొడవునా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేవారు.
అయన సంవత్సరానికి 18 సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఎక్కువే. కృష్ణ దాదాపుగా 300 సినిమాలు చేయటమే కాక తెలుగువారికి హలీవుడ్ తరహ పాత్రలని మొదటగా పరిచయం చేసారు. కృష్ణ కొడుకులు రమేష్,మహేష్ కూడా సినీ పరిశ్రమలోనే ఉన్నారు.
రమేష్ మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుతం నిర్మాతగా ఉన్నాడు. మహేష్ తండ్రి వారసత్వాన్ని తీసుకోని సూపర్ స్టార్ మహేష్ బాబుగా ఎదిగాడు. ఇక కూతుర్ల విషయానికి వస్తే మంజుల మాత్రమే సినీ రంగంలో ఉన్నది.
ఇక సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో సంపాదించిన డబ్బును ఏమి చేసారో తెలుసా? అయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును మూడు భాగాలుగా చేసి, ఒక భాగం ఆయన మొదటి భార్య ఇదిరా దేవి గారికి,అలాగే రెండవ భాగం ఆయన పిల్లలకు,ఇక మూడవ భాగం ఆయన రెండవ భార్య అయిన విజయ నిర్మల గారికి ఇచ్చేవారట.
ఇలా కృష్ణ అయన సంపాదనను అందరికి సమానంగా పంచేవారట. దీంతో ఎవ్వరిని ఆయన వదిలేయలేదు.అందరిని సమానం గా చూసుకున్నాడు.అందుకే ఆయన కు అంత పేరు.ఉంది.