Politics

అమెరికాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నాడు… గుట్టు రట్టయింది

మధ్యప్రదేశ్,రాజస్థాన్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవడంతో ఇక ఫైనల్ గా సార్వత్రిక ఎన్నికలే మిగిలాయి. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎపి అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఏపీలో ప్రధానంగా అధికార టీడీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎత్తులు వేస్తుంటే, ఎలాగైనా ఈసారి అధికారం దక్కించుకోవాలని వైఎస్ జగన్ కృషి చేస్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీచేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నద్ధం అవుతున్నారు.

వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో గెలవడానికి ఆయా పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఎన్నో ప్రజాకర్షక పథకాలకు కసరత్తు చేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కూడా హామీలు ఇస్తున్నారు. అందులో భాగంగా అధికారంలోకి వస్తే, దివ్యాన్గులకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ ఇస్తామని పవన్ ప్రకటించారు. రిజర్వేషన్లు, ప్రత్యేక కార్పొరేషన్లు,హాస్టల్,విద్యావకాశాలు, ఉద్యోగాలు,హెల్త్ కార్డులు ఇలా ఎన్నో హామీలు గుప్పిస్తున్నారు.

ఇక సామాజిక పెన్షన్ 5వేలకు పెంచాలని, వీటిని అమలు చేయాలంటే తగిన వనరులుండాలి. అందుకోసం అమెరికాలో ఆయన పర్యటిస్తూ పెట్టుబడుల అవకాశాలను చూస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ, ఆయా వర్గాలతో మమేకం అవుతూ హామీలు కూడా ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమెరికా వెళ్లారు. ఆయన వెంట పార్టీనేత , మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా వెళ్లారు. అయితే అమెరికాలో ఏంచేస్తున్నారనే దానిపై రకరకాల కథనాలు వినవస్తున్నాయి.

వాషింగ్టన్ లోని అర్బన్ డవలప్ మెంట్ అండ్ హౌసింగ్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ బెన్ కార్సన్ ని కలుసుకున్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడుల కోసం సెక్రటరీ ని కలిసినట్లు పవన్ చెబుతున్నారు. ఎన్నికల్లో గెలిస్తే వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి చేపడతామని ఇప్పటికే ఆ ప్రాంతాల పర్యటనలో చెప్పిన పవన్, అధికారంలోకి వస్తే ఎలా అమలు చేయాలన్న దానిపై ఇప్పటినుంచే పెట్టుబడులను రాబట్టడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.