Movies

రైజింగ్ రాజు కష్టాలు…. జబర్దస్త్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు

విమర్శలు ఎన్ని వస్తున్నా ఒక్కటి మాత్రం నిజం ఎన్నో ఇబ్బందులు పడ్తున్న కళాకారులకు మూడు పూటలా తిండి పెడ్తున్న కార్యక్రమంగా జబర్దస్త్ నిలిచిందని చెప్పవచ్చు. టిఆర్పి రేటింగ్ కూడా అదిరిపోతోంది జబర్దస్త్ లో ఛాన్స్ లు దక్కించుకున్నవాళ్ళు తమ ఇళ్లల్లో కష్టాలను అధిగమించి,ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు.ప్రతిభ ఉన్నా సరే,ఛాన్స్ లు లేక నిస్తేజంలో కొట్టుమిట్టాడిన ఎందరికో జబర్దస్త్ వేదికగా నిలుస్తోంది. అందులోరైజింగ్ రాజు ని ప్రధానంగా చెప్పుకోవాలి. యితడు ముందుగా సినీ పరిశ్రమకు వెళ్లి అక్కడ నుంచి ఇంటి బాట పట్టి, ఆ తర్వాత బుల్లితెరకు అది కూడా జబర్దస్త్ తోనే ఎంట్రీ ఇచ్చాడు. రాజు 1979లోనే టాలీవుడ్ లో ప్రవేశించాడు.

ఆనాటి నుంచి సినిమాల్లో సెటిల్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేసాడు. నిరాశ నిస్పృహ ల నేపథ్యంలో జబర్దస్త్ ప్రోగ్రాం అతడికి ఊతమిచ్చింది. హైపర్ ఆది కాంబినేషన్ లో చేసిన స్కిట్స్ పేలాయి. ఆడియన్స్ ని నవ్వుల్లో ముంచాయి. ఒకప్పుడు కూలీపనులకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాజుకి ఏజ్ బార్ అయిన నేపథ్యంలో జబర్దస్త్ ప్రోగ్రాం లో ఛాన్స్ రావడం, అతని కోసం జనం ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి రావడం నిజంగా గ్రేట్.

టాలెంట్ ఉంటె వయస్సు అడ్డురాదని చాటి చెప్పిన రాజు వివరాల్లోకి వెళ్తే, ఇతని స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం. చిన్నతనం నుంచి నాటకాల పిచ్చి కారణంగా పెద్దయ్యాక కంటిన్యూ అయ్యాయి. దీంతో సినీ ఛాన్స్ ల కోసం పిచ్చపిచ్చగా ప్రయత్నించాడు. నూతన్ ప్రసాద్ నిర్మించిన ఓ సినిమాకు రైజింగ్ రాజు సోదరుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. ఇక అదే ఆఫీసులో వేజెళ్ళ సత్యనారాయణ క్యాషియర్ గా చేసేవాడు. అతనితో పరిచయం కారణంగా మరోమలుపు అనే మూవీలో రాజుకి ఛాన్స్ వచ్చింది.

అయితే ఆతర్వాత ఛాన్స్ లు లేకపోవడం,తో సొంతూరు వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఉన్నప్పుడు కూలిపనులు,పెయింటింగ్ పనులు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. ఓసారి చలాకి చంటి రామచంద్రపురం వెళ్ళినపుడు అక్కడ రాజు గురించి కొందరి ద్వారా తెలుసుకుని,అప్పటికప్పుడు కొన్ని స్కిట్స్ అతని చేత వేయించడం,నటన బాగుండడంతో జబర్దస్త్ ప్రోగ్రాంలో తన టీమ్ లో ఛాన్స్ ఇచ్చాడు. అలా నిలదొక్కుకున్న రాజు రైజింగ్ రాజుగా మారాడు. వీళ్ళ కాంబినేషన్ లో స్కిట్స్ ఆటం బాంబ్ ల్లా పేలాయి.

స్టార్ గా మారిన రాజు,ఇక హైపర్ ఆదితో కల్సి తెలుగు రాష్ట్రాల్లో అనేక ఈవెంట్స్ లో పాల్గొన్నాడు. కూతురు పెళ్లికోసం చేసిన పదిలక్షల అప్పు తీర్చేసాడు. ఇక జబర్దస్త్ లో చేస్తున్న దాన్ని గుర్తించి ఆర్టిస్టులకు సినిమాల్లో కూడా ఛాన్స్ లు వస్తున్నాయి. టాలివుడ్ లో ఛాన్స్ కోసం ప్రయత్నించేవాళ్ళు ముందుగా జబర్దస్త్ కి వస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్న గ్యారంటీ కల్పించింది. గెటప్ శ్రీను,షకలక శంకర్,చమక్ చంద్ర,హైపర్ ఆది ఇలా చాలామందికి జబర్దస్త్ కారణంగానే సినిమాల్లో ఛాన్స్ లు వెల్లువెత్తుతున్నాయి.