Movies

టాలీవుడ్ లో అధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్… నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు?

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే లక్కుండాలి. దానికి తోడు టాలెంట్ ఉండాలి. ఇక హీరోయిన్స్ కి అందం,అభినయం ఉంటె వాళ్ళ పంట పండినట్లే. టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతారు. వాళ్లకు ఎంత డబ్బైనా సరే ఇచ్చి తమ మూవీస్ లో పెట్టుకోడానికి ప్రొడ్యూసర్స్ క్యూ కడతారు. భాషతో సంబంధం లేకుండా తమ అందాలను ఆరబోస్తూ,అభినయంతో ఆకట్టుకునే హీరోయిన్స్ కి ఛాన్స్ లు వెల్లువెత్తుతాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఇలా రాణించే తెలుగు హీరోయిన్స్ తక్కువే. అయితే ఇతర భాషా హీరోయిన్స్ తెలుగులో బాగా దూసుకుపోతున్నారు.

అనుష్క,రకుల్ ప్రీత్ సింగ్,నయనతార,తమన్నా,త్రిష, శృతి హాసన్, సమంత,కాజల్ అగర్వాల్, ఇలా ఎవరిని చూసినా నిజమైన తెలుగు వాళ్ళు కనిపించే పరిస్థితి లేదని చెప్పవచ్చు. సమంత తండ్రి తెలుగు వారే అయినప్పటికీ తల్లి మళయాళీ. అంజలి తెలుగమ్మాయి అయినా తమిళంలో ఎక్కువ మూవీస్ చేస్తోంది. దీంతో పరభాషా హీరోయిన్స్ టాలీవుడ్ లో రాజ్యమేలుతున్నారు. దీంతో వాళ్ళ రెమ్యునరేషన్స్ భారీ స్థాయిలో ఉంటున్నాయి.

ఎన్టీఆర్,ప్రభాస్,అల్లు అర్జున్,మహేష్ బాబు,పవన్ కళ్యాణ్, వంటి అగ్ర హీరోలతో చేసిన తమన్నా ఒకప్పుడు కోటి రూపాయలు తీసుకునేది. అయితే బాబుబలి తర్వాత డౌన్ ఫాల్ మొదలయింది. మీడియం రేంజ్ హీరోల సరసన చేస్తోన్న ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం 90లక్షలకు కొంచెం అటు ఇటూ ఉంది. కొన్ని సినిమాల్లో గ్లామర్ కోసం అందాల ప్రదర్శన చేసిన అనుష్క ఆతర్వాత అరుంధతి,రుద్రమదేవి,బాహుబలి వంటి మూవీస్ లో ఆమె నటన హైలెట్ అయింది.

తన తోటి హీరోయిన్స్ ని వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లిన అనుష్క భారీ బడ్జెట్ మూవీస్ కి కేరాఫ్ గా మారింది. దాంతో ఆమె ఒక్కో సినిమాకు 4కోట్లు వసూలు చేస్తోంది. నిజానికి మిర్చి మూవీ నాటికీ మూడున్నర కోట్లు తీసుకునే ఈ స్వీటీ బ్యూటీ బాహుబలితో ఫిక్స్డ్ గా నాలుగు కోట్లు చేసింది. భాగమతి తర్వాత ఈమె ఏ మూవీ చేయకపోయినా ఈమె క్రేజ్ లో ఏ మాత్రం మార్పు లేదు.

తమిళంలో టాప్ రేంజ్ లో వెలుగొందుతున్న నయనతార, త్రిష తెలుగులో నటించాల్సి వస్తే ఒక్కో సినిమాకు కోటి వసూలు చేస్తున్నారు. సినిమాను బట్టి నయనతార రేటు పెంచేస్తుంది. అందుకే రామ్ చరణ్ నిర్మించే సైరా మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి మూడుకోట్లు తీసుకుంటోందట. ఇక కమలహాసన్ కూతురు శృతి హాసన్ హిట్స్ తో సంబంధం లేకుండా ఫిక్స్డ్ రేట్ గా రెండున్నర కోట్లు ముట్టజెప్పాల్సిందే. ఒకప్పుడు కాజల్ నటించిన ప్రతి మూవీ హిట్ కొట్టడంతో నెంబర్ వన్ రేంజ్ కి వెళ్ళింది.

అయితే ఓ అరుదైన వ్యాధి బారిన పడడంతో కొన్ని నెలలు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ఈమె ప్లేస్ ని కొందరు ఆక్రమించినా ఈమె రెమ్యునరేషన్ ఇప్ప్పటికీ రెండు కోట్లు ఉంది. ఇక హిట్స్ వచ్చినా రేటు పెంచకుండా స్టడీగా కెరీర్ లో ముందుకెళ్తున్న సమంత కు పెళ్లయినా సరే ప్రొడ్యూసర్స్ రేటు తగ్గించలేదు. ఈమె ఒక్కో మూవీకి రెండు నుంచి రెండున్నర కోట్లు తీసుకుంటోంది.