ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకుల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
తెలుగులో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. అందులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం శైలి డిఫరెంట్ గా ఉంటుంది. రాజకీయాల్లో కూడా చేరి,కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిన ఈయన డాక్టర్ వైఎస్ హయాంలో సాంస్కృతిక శాఖ చైర్మన్ గా సేవలందించారు. ప్రకాశం జిల్లా కొమ్మినేని వారిపాలెం గ్రామానికి చెందిన ధర్మవరపు మొదటి నుంచి కమ్యూనిస్ట్ భావజాలం గల వ్యక్తి. ఈయనకు భార్య ,ఇద్దరు కుమారులున్నారు. ప్రజా నాట్యమండలి పక్షాన అనేక అభ్యుదయ నాటకాల్లో వేసాడు. ఇక ఒంగోలులో చదివేటప్పుడు సినీ మోజుతో ఇంట్లో చెప్పాపెట్టకుండా మద్రాస్ చెక్కేసాడు.
అక్కడ ఎవరూ తెలుసున్న వాళ్ళు లేకపోవడంతో సొంతూరికి గిర్రున తిరిగి వచ్చేసాడు. బుద్ధిగా వ్యవసాయం చేస్తున్న యితడు ఫ్రెండ్స్ సలహాతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి,పంచాయితీ రాజ్ శాఖలో ఆఫీసర్ గా సెలక్ట్ అయ్యాడు. దాంతో ధర్మవరపు తన మకాం హైదరాబాద్ కి మార్చాడు. దిల్ సుఖ్ నగర్ లోని శారదా నగర్ లోనే మకాం పెట్టాడు. అక్కడ ఉండగా ఆకాశవాణి,దూరదర్శన్ లకు నాటకాలు రాసాడు.
టివిలో ఆనందో బ్రహ్మ నాటకంలో పాపులర్ అయ్యాడు. అందులో అతని నటన చూసిన హాస్య బ్రహ్మ జంధ్యాల తాను తీసిన జయమ్ము నిశ్చయంబురా మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. అలా టివి రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన ధర్మవరపు హావభావాలతో నవ్వించగల కమెడియన్ అని చెప్పాలి. నువ్వు నేను,ధైర్యం తదితర చిత్రాల్లో కడుపుబ్బా నవ్వించిన ధర్మవరపు ఒక్కడు సినిమాలో పాస్ పోర్ట్ ఆఫీసర్ గా, వర్షం మూవీలో గాలి గన్నారావుగా చేసిన యాక్టింగ్ అదిరిపోయింది.
పెళ్ళిపుస్తకం,మిస్టర్ పెళ్ళాం,ఇంద్ర,ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం,ఒక్కడు,సింహాద్రి,అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి,వర్షం వంటి మూవీస్ తో స్టార్ కమెడియన్ అయ్యాడు. ఇక దుబాయ్ శీను,చిరుత, బొమ్మరిల్లు,మన్మధుడు,మాస్ తదితర మూవీస్ లలో బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ లతో ధర్మవరపు పోటీ పడి నటించాడు.
క్యాన్సర్ సోకడంతో 2013లో ధర్మవరపు కన్నుమూయడంతో అందరూ షాక్ తిన్నారు. పిల్లలను సినీ పరిశ్రమకు దూరంగానే ఉంచాడు. ఈయన భార్య కృష్ణజ. కొడుకులు రోహిత్ సందీప్,రవి బ్రహ్మతేజ వ్యాపార రంగంలో ఉన్నారు. సినిమాలకు దూరంగా వ్యాపారంలో ప్రోత్సహించడంతో బానే సెటిల్ అయ్యారు. ఇక ఇప్పుడు కూడా శారదా నగర్ లోనే ఆయన కుటుంబం నివసిస్తోంది.