ఐరెన్ లెగ్ శాస్త్రి కొడుకు దయనీయ స్థితి చూస్తే గుండె కరుగుతుంది….పాపం ఎలా ఉన్నాడో?
సినిమాలకు ముహూర్తాల వేడుకలకు వెళ్తూ నటనపై ఆసక్తి పెంచుకుని పలు చిత్రాల్లో నటించిన ఐరెన్ లెగ్ శాస్త్రి మద్యానికి బానిసై అప్పట్లో హఠాన్మరణం చెందాడు. అయితే అతని కొడుకు ప్రసాద్ కూడా సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ కి షిఫ్ట్ అయి ఛాన్స్ ల కోసం జోరుగా ప్రయత్నాలు చేసున్నాడు. ఐరెన్ లెగ్ శాస్త్రి వెండితెరపై కనపడితే చాలు నవ్వులు పండేవి. కేవలం అతని రూపమే అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రేమఖైదీ మూవీలో బ్రహ్మానందం తో కల్సి చేసిన కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. వీళ్లద్దరి కాంబినేషన్ ఆడియన్స్ కి హాస్యం పండించేది.
అప్పుల అప్పారావు మూవీతో తెలుగు చిత్ర రంగంలో అడుగుపెట్టిన ఐరెన్ లెగ్ శాస్త్రి తన భారీ ఫిజిక్ తో , మంచి ఎక్స్ ప్రెషన్ తో ఆడియన్స్ ని అలరించాడు. ఇతడి అసలుపేరు గూనపూడి విశ్వనాధ శాస్త్రి. సినిమాలకు యితడు ముహుర్తాలు పెట్టే పురోహితుడు. తన గురువుతో కల్సి సినిమా ముహూర్త వేడుకలకు వెళ్లిన సందర్భంలో నటనపై ఆసక్తి పెంచుకున్నాడు.
కేరక్టర్ ఆర్టిస్ట్ గా వేయడానికి భారీకాయం అడ్డుకోవడంతో కమెడియన్ గా సరిపోతావని డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చెప్పడంతో అలా ఎంట్రీ ఇచ్చాడు. ఈవీవీ ప్రోత్సాహంతో అప్పుల అప్పారావు, ప్రేమఖైదీ , ఏవండీ ఆవిడ వచ్చింది,జంబ లికడి పంబ వంటి చిత్రాల్లో కమెడియన్ గా రాణించాడు. సినిమాల్లో కమెడియన్ గా బిజీ అయిన తరుణంలో వ్యసనాలు ఐరెన్ లెగ్ శాస్త్రిని దెబ్బకొట్టాయి.
మద్యానికి బానిసగా మారడంతో 2006లో గుండె జబ్బు బారిన పడి, ఆతర్వాత లివర్ కూడా దెబ్బతినడంతో కన్నుమూశాడు. ఇక చివరి రోజుల్లో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే ఆయన చనిపోయాక రిక్షాలో ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. ఇతనికి ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. అతడు కూడా భారీ కాయుడే.
సినిమాల్లో ఛాన్స్ లకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కుటుంబ పోషణ కూడా కష్టం కావడంతో సంపూర్ణేష్ బాబు 25వేలు,కాదంబరి కిరణ్ మరికొంత సాయం చేసారు. దీంతో సిఎ కూడా పూర్తిచేసి,తాడేపల్లి గూడెం నుంచి భాగ్యనగరానికి షిఫ్ట్ అయ్యాడు. జంబ లికడి పంబ మూవీలో నటించిన ప్రసాద్ ఇంకా సినీ ఛాన్స్ లకోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.