కైకాల సత్యనారాయణ కొడుకు ఇప్పుడు సినీ రంగంలోకి ఎందుకు వచ్చాడో చూడండి

అది విలన్ కావచ్చు,కేరక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు. పెద్ద మనిషి పాత్ర కావచ్చు, పౌరాణికం కావచ్చు జానపదం కావచ్చు, ,కమెడియన్ కావచ్చు , పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి నటించగల సత్తా గల నటుడు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ. తెలుగు సినిమా పరిశ్రమలో సత్యనారాయణకు విలక్షణమైన గుర్తింపు ఉంది. దాదాపు 777కి పైగా చిత్రాల్లో నటించిన సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935జులై 25న కైకాల లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. గుడివాడ, విజవాడలలో ప్రాధమిక,ప్రాధమికోన్నత విద్యలను పూర్తిచేసి,గుడివాడ కాలేజీ నుంచి డిగ్రీ అందుకున్నారు. 1960ఏప్రియల్ 10న నాగేశ్వరమ్మతో వివాహం అయింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

సినిమాల్లో వేషం కోసం మద్రాసు వెళ్లిన సత్యనారాయణను మొదటిసారిగా నారాయణ గుర్తించి, 1959లో సిపాయి కూతురు మూవీలో చిన్న పాత్ర ఇచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ సత్యనారాయణ రూపురేఖలు ఎన్టీఆర్ ని పోలి ఉండడం వలన ఎన్టీఆర్ కి మంచి డూప్ దొరికినట్లు అయింది. ఎన్టీఆర్ కూడా గుర్తించి అపూర్వ శిర చేద చింతామణి మూవీలో ఓ విలన్ పాత్ర ఇచ్చారు. అయితే సత్యనారాయణ ఒక విలన్ గా గుర్తించిన ఘనత జానపద బ్రహ్మ విఠలాచార్య దే.

ఎందుకంటే కనకదుర్గా పూజ సినిమాలో విలన్ పాత్ర ఇవ్వడం,అది క్లిక్ అవ్వడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇక వరుసగా విలన్ పాత్రలు వచ్చాయి. మరోపక్క కేరక్టర్ యాక్టర్ గా కూడా నటించాడు. ఆవిధంగా తెలుగు ఇండస్ట్రీకి ఓ విలక్షణ నటుడు సత్యనారాయణ రూపంలో దొరికాడు. ఈయన వేయని పాత్ర అంటూ లేదు. యమగోల ,యముడికి మొగుడు, యమలీల చిత్రాల్లో యముడిగా చేసిన నటన చూస్తే, ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి.

కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీఆర్ ఎలా ఒదిగిపోయాడో అలాగే యముని పాత్రలో సత్యనారాయణ అలా చేసాడు. అంతేకాదు ఎస్వీఆర్ తర్వాత రావణుడు,ఘటోత్కచుడు,రావణుడు, దుర్యోధనుడు,ఇలా ఎన్నో పాత్రలను పోషించి మెప్పించాడు. రౌడీగా,తండ్రిగా, తాతగా, ఇలా ఎన్నో విభిన్న పాత్రల్లో ఒదిగిపోయాడు. ఇక రమా ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ సంస్థను నెలకొల్పి,కొదమసింహం,బంగారు కుటుంబం,ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించారు.

కూతుళ్ళిద్దరికీ పెళ్లిచేసి,కొడుకులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. వ్యాపార రంగంలో నిలదొక్కుకున్న ఇద్దరు కొడుకులు ఎప్పుడూ మీడియా కంట పడలేదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల పిల్లలు చేసే హంగామాకు పూర్తి భిన్నంగా కైకాల వారసులు నిలిచారు. అయితే బాహుబలిని మించి నిర్మితమైన హీరో యాష్ నటించిన కెజిఎఫ్ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ కైకాల కుమారుడు కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ దృష్టిని ఆకర్షించారు. ఇది నిజంగా కైకాల సత్యనారాయణ అభిమానులకు ఆనందించే విషయం అనే చెప్పాలి.