MoviesTollywood news in telugu

స్టోరీ అదిరినా సరే ….హిట్ టాక్ రాని సినిమాలు…ఎన్ని ఉన్నాయో చూడండి

Tollywood Movies:కొన్ని సినిమాలు కథా పరంగా,పాటల పరంగా ,నటనాపరంగా చాలా బాగుంటాయి. కానీ ఎందుకనో హిట్ టాక్ రాకుండా పోతాయి. అలాగని ఆ సినిమాలు టీవీల్లో వస్తే,ఆడియన్స్ బాగానే చూస్తారు. మంచి వ్యూవర్ షిప్ ఉంటుంది. మరి ఎందుకు హిట్ కాలేదంటే సమాధానం దొరకదు. అలాంటి సినిమాల విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఊసరవెల్లి సినిమా బాగున్నా సరే ,హిట్ టాక్ రాలేదు. పైగా డిజాస్టర్ అయింది. కథ,కధనం,ఎన్టీఆర్ స్టెప్స్ ఇలా బాగున్నా సరే విజయాన్ని నమోదు చేసుకోలేదు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తీసిన ఆర్య సినిమా మంచి హిట్ అయింది. బన్నీకి మంచి క్రేజ్ వచ్చింది. కానీ దానికి సీక్వెల్ గా తీసిన ఆర్య 2మాత్రం ఎందుకో హిట్ అవ్వలేదు.

బన్నీ,కాజల్,నవదీప్ నటన అన్నీ బాగున్నా సరే ప్లాప్ అయింది. అలాగే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన జగడం కూడా హిట్ కాలేదు. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాగున్నా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. నేచురల్ స్టార్ నాని చాల జాగ్రత్తగా సినిమాలు చేస్తాడు. ఒక్కసారి అయినా నాని సినిమా చూడచ్చు అనే టాక్ కూడా ఉంది. కానీ యితడు నటించిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమా అట్టర్ ప్లాప్ అయింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనుష్క జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఖలేజా సినిమా గురించి హిట్ టాక్ రాలేదు. పైగా ప్లాప్ టాక్ వచ్చింది. ‘ఈ సినిమా బాగా వచ్చింది. తర్వాత వచ్చే సినిమాల్లో ఇంతకంటే ఎక్కువగా ఏమి చూపించలేం’అని విడుదలకు ముందు మహేష్ బాబు స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక సినిమా చూసిన వాళ్ళు కూడా బానే ఉందన్న టాక్ వచ్చింది.

ఇక జనరల్ గా కూడా ఈ సినిమాలో మహేష్ నటన,అనుష్క అందాలు,పాటలు,మాటలు అన్నీ బాగున్నాయి. కానీ ఎందుకో హిట్ అవ్వలేదు. నాగార్జున వెరైటీగా తీసిన సినిమా గగనం. అందరూ సినిమా చూసి బాగుందన్నారు. కానీ హిట్ అవ్వలేదు. ప్రభాస్ కెరీర్ లో అంత్యంత డిజాస్టర్ మూవీ గా మున్నా నిలిచింది. ప్రభాస్,ఇలియానా,ప్రకాష్ రాజ్ ఇలా ఎవరికి వాళ్ళు బాగా నటించినా సరే, హిట్ టాక్ తెచ్చుకోలేదు. కారణం తెలీదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హిట్స్ తో సంబంధం లేకుండా మార్కెట్ ఉన్న హీరో అని చెప్పాలి.

అంతలా అయన అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ యితడు నటించిన గుడుంబా శంకర్ సినిమా చూడ్డానికి బాగున్నా డిజాస్టర్ అయింది. ఇక నారా రోహిత్ సినిమాలు బానే ఉంటాయి. కానీ రౌడీ ఫెలో మూవీ ఘోరంగా దెబ్బతింది. హిట్,ప్లాప్ అనే తేడా లేకుండా ఇతడి సినిమాలు ఆకట్టుకుంటాయి. కానీ హీరో,విలన్ పోటాపోటీగా నటించిన ఈ సినిమా ఎందుకు ప్లాప్ అయిందో ఎవరికీ తెలీదు.
ram charan orange
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా దారుణంగా దెబ్బతింది. ప్రేమకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఈ సినిమాను నాగబాబు నిర్మించాడు. కానీ డిజాస్టర్ అవ్వడంతో నాగబాబు ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బతిన్నాడు.