MoviesTollywood news in telugu

గ్యాంగ్ లీడర్ సినిమా విలన్ ఆనంద్ రాజ్ గుర్తున్నాడా ? మరి అతని కొడుకు ఎవరంటే?

Telugu villain Anand Raj:రంగుల ప్రపంచం సినిమా రంగంలో ఎన్నో కసరత్తులు చేస్తే గానీ ఓ సినిమా తయారవ్వదు. ఒక్కో సినిమాలో పాత్రల రూపకల్పన , అందుకు నటీనటుల ఎంపిక ఇలా ప్రతిదీ ముఖ్యమే. ఒక్కో సీన్ ని పండించడానికి ఎన్నో హంగులు,రంగులు సరేసరి. ఒక్కో పాత్ర తీరు చూస్తే,ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇక సినిమాలో హీరో ఎంత ప్రధానమో అందుకు ధీటుగా విలన్ కూడా అంతే ప్రధానం. విలనిజం పండించడం నిజంగా ఓ కళ. మన సినిమాల్లో చాలామంది విలన్లు ఉన్నారు. ఇక పరభాషా చిత్రాల నుంచి కూడా విలన్లను తీసుకొచ్చి యాక్ట్ చేయిస్తున్నారు. ఇక కొందరు విలన్ లను తెరమీద యాక్షన్ చూసాక వాళ్ళను తిట్టాలని,కొట్టాలని ఉంటుంది. అలాంటి క్రూరమైన విలన్ లలో ఇప్పుడు మనకు తెల్సిన ఓ విలన్ గురించి తెలుసుకుందాం.

అతనెవరో కాదు ఆనంద్ రాజ్. ఇంతకీ అతనెవరంటే పాండిచ్చేరికి చెందిన ఇతడికి చిన్నప్పటినుంచి సినిమాలంటే మోజు. తండ్రి బిజినెస్ మాన్. ఎనిమిది మంది గల పెద్దకుటుంబంలో నుంచి వచ్చిన ఆనంద్ రాజ్ కి పెళ్లవ్వడం,ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. కొడుకు బాగా చదువుకుని పోలీసాఫీసర్ అవ్వాలన్నది తండ్రి కోరిక గా ఉండేది. అయితే కొడుకు అభిరుచిమేరకు ఎంజీఆర్ యాక్టింగ్ స్కూల్ లో చేర్పించాడు.

కన్నడ స్టార్ హీరో శివ కుమార్ తో అక్కడ ఏర్పడ్డ పరిచయం కారణంగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అయితే నటనలో శిక్షణ పొందిన ఆనంద్ రాజ్ సినీ ఛాన్స్ లు వెతుక్కుంటూ వస్తాయని భావించాడు. కానీ ఎన్నో కష్టాల తరవాత 1988లో తిమిళంలో ఒరువరు వాజమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆలయం,ఉరుమై గీతం సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తం మూడు సినిమాల్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో అతను వెనక్కి తిరిగిచూడలేదు.

తెలుగు,తమిళం,మళయాళం,హిందీ భాషల్లో కూడా విలన్ పాత్రలతో ఆరితేరాడు. అయితే అప్పటికే కొన్ని సినిమాల్లో హీరోగా వేసినప్పటికీ విలన్ గా బాగా క్లిక్ అవ్వడంతో హీరోగా ఆడియన్స్ ఆదరించలేకపోయారు. విలన్ గా గుర్తింపు వచ్చాక హీరోలాంటి పాత్రలు చేస్తే, గమ్మున గుర్తించలేరు. రజనీకాంత్,శరత్ కుమార్,ముమ్ముట్టి,చిరంజీవి,నాగార్జున ,వెంకటేష్,బాలకృష్ణ,ఇలా అందరి సినిమాల్లో పోటాపోటీగా నటించి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలుగులో ముద్దుల మావయ్యతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ రాజ్,ఆతర్వాత ఒంటరి పోరాటం,లంకేశ్వరుడు,టు టౌన్ రౌడి,ప్రాణానికి ప్రాణం,ఇద్దరి ఇద్దరే ,గ్యాంగ్ లీడర్,సూర్య వంశం వంటి ఎన్నో సినిమాల్లో నటించాడు. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన ఆనంద్ రాజ్ బాలీవుడ్ లో విలన్ గా అడుగుపెట్టాడు.

ప్రభుదేవా డైరెక్షన్ లో అజయ్ దేవగన్ హీరోగా నటించిన యాక్షన్ జాక్సన్ మూవీలో డాన్ పాత్రలో రాణించాడు. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్న ఆనంద్ రేజ్ గ్యాంగ్ లీడర్ మూవీలో కనకాంబరంగా విలన్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఆనంద్ రాజ్ పిల్లలు సినీ ఫీల్డ్ లోకి రాలేదు. కొడుకు అమెరికాలో బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయ్యాడు. కూతురు కూడా కుటుంబంతో అమెరికాలో ఆనందంగా ఉంది.