Movies

2018 లో బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టిన టాలీవుడ్ సినిమాలు

ఒక్కో సంవత్సరం ఒకో విధంగా జాతకం ఉంటుందని అంటారు. అందుకే పాత సంవత్సరంలో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కొత్త ఏడాది వైపు ఎదురుచూస్తారు. ఇక సినిమాల విషయంలో కూడా ఒక్కో ఏడాది ఒక్కోవిధంగా ఉంటుంది. మరో నాలుగు రోజుల్లో ముగియనున్న 2018ని పరిశీలిస్తే తెలుగు చిత్ర రంగంలో మిశ్రమ ఫలితాలు మిగిలాయి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా కలెక్షన్స్ లో దూసుకెళ్లాయి. కలెక్షన్స్ లో టాప్ ఫైవ్ మూవీస్ తీసుకుంటే,హయ్యెస్ట్ కలక్షన్ సాధించిన మూవీగా రంగస్థలం మూవీ చెప్పుకోవచ్చు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెవిటి వాడిగా నటించిన 1980నాటి గ్రామీణ నేపధ్యం గల ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించాడు. రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గానే కాదు, హయ్యెస్ట్ రికార్డ్ గ్రాస్ సాధించింది. కథతో పాటు పాత్రలు అన్నీ కుదరడంతో బాహుబలి రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఈ సినిమాకు ఫుల్ రన్ లో ఓవరాల్ గా 215కోట్లు గ్రాస్ వసూలైంది. వరల్డ్ వైడ్ గా 125కోట్లు డిస్ట్రిబ్యూటర్స్ షేర్ తెచ్చింది.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అందరికీ తెల్సిందే. సినిమా హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపించడం పవన్ సినిమాలకే చెల్లింది. ఇక ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అజ్ఞాత వాసి మూవీ తేడాకొట్టినప్పటికే కలెక్షన్స్ లో దూసుకుపోయింది.
ఓపెనింగ్స్ దుమ్మురేపడంతో ఫుల్ రన్ లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 110కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి మొదటి అటనుంచే ఈ సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే,వసూళ్ల కుంభవృష్టి రెండు రోజులు కొనసాగింది. ఇక ఆకుపెన్సీ రేటు తగ్గడంతో వసూళ్లపై ప్రభావం పడింది. మిగతా హీరోలకన్నా పవన్ ఎందుకు స్పెషల్ హీరో అనే సంగతి ఈ వసూళ్లే రుజువుచేశాయ.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,జూనియర్ ఎన్టీఆర్ తొలి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ 2018లో భారీ బ్లాక్ బ్లస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 150కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన ఈమూవీ ఎన్టీఆర్ చిత్రాల్లో హయ్యస్ట్ గ్రాస్ వసూలుగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా వంద కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇక యువ హీరోల్లో రాత్రికి రాత్రే స్టార్ డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం మూవీ వంద కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోయింది. గీతా ఆర్ట్స్ సబ్ బ్యానర్ లో విజయ్ తో రేష్మిక మందన జోడీ కట్టిన రొమాంటిక్ కలర్ మూవీ 126కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అన్ని సెంటర్లలో కలిపి డిస్ట్రిబ్యూటర్స్ షేర్ 70కోట్లు వచ్చింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అను నేను మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఇండస్ట్రీలో తన రికార్డులను తానే బద్దలుకొడుతున్న మహేష్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సరికొత్త కథనంలో వచ్చి మరోసారి తన సత్తా చాటాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 187కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక డిస్ట్రిబ్యూటర్ షేర్ అయితే వందకోట్లు దాటింది. ఇక వరల్డ్ వైడ్ గా 105కోట్లు షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.