Movies

హీరోయిన్ లత ఇంటిలో ఎంత మంది నటులు ఉన్నారో తెలుసా? శ్రీప్రియకు లతకు ఉన్న రిలేషన్ ఏమిటో తెలుసా?

వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లతా సేతుపతి అంటే తమిళనాట పెద్ద పేరు. నిజానికి రాజ కుటుంబానికి చెందిన లత తమిళంలోనే కాదు,తెలుగు,కన్నడ,మళయాళ భాషల్లో నటించింది. ప్రస్తుతం తల్లి,అత్తా పాత్రల్లో నటిస్తోంది. 70 – 80దశకంలో గోల్డెన్ లెగ్ గా వెలుగొందింది. ఎంజీఆర్ తో హీరోయిన్ గా చేసిన ఈమె ఎంజీఆర్ లత గా పేరుగాంచింది. చెన్నైకి సమీపంలోని రామాపురం హవేలికి ఆమె తండ్రి రాజుగా ఉండేవారు. తెలుగులో ఎన్టీఆర్,అక్కినేని,కృష్ణ వంటి హీరోలతో నటించింది. నిజానికి హీరోయిన్ అవ్వాలనే కోరిక లేకపోయినా ఆమె మేనత్త, తెలుగు నటి అయిన కమలా కోట్నీస్ ప్రభావంతో లత హీరోయిన్ అయింది.

కమలా కోట్నీస్ తెలుగులో చెంచు లక్ష్మి,జీవన జ్యోతి,బాలనాగమ్మ వంటి చిత్రాల్లో నటించింది. హిందీలో దేవానంద్ తో కల్సి చేసింది. ఈమె స్పూర్తితో హీరోయిన్ అయిన లత 90వ దశకంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. సింగపూర్ కి చెందిన సేతుపతితో లవ్ లో పడి పెళ్లిచేసుకున్న లత కొన్నాళ్ళు సింగపూర్ లో ఉంది. ఈమెకు ఇద్దరు కుమారులు. మళ్ళీ ఇండియాకు వచ్చిన ఈమె 2000నుంచి కేరక్టర్ యాక్టర్ గా నటించడం మొదలెట్టింది.

వెండితెరమీద అమ్మ, అత్తా పాత్రలే కాదు, నటి రాధికతో కల్సి టివి సీరియల్స్ లో కూడా హవా సాగిస్తోంది. ఇక కొడుకులిద్దరూ సినిమా రంగంలో ఇంట్రెస్ట్ లేకపోవడంతో సింగపూర్ లోనే వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఇక లత సోదరుడు రాజకుమార్ సేతుపతి కూడా మంచి నటుడు. తమిళంలో వందకు పైగా సినిమాల్లో నటించిన సేతుపతి తెలుగులో మానసవీణ మూవీలు నటించాడు.

రెండు సినిమాలు నిర్మించాడు. ఇక రాజ్ కుమార్ సేతుపతి భార్య శ్రీప్రియ కూడా లతతో కల్సి అనేక సినిమాల్లో నటించింది. దాదాపు 200పైగా సినిమాల్లో నటించి ,దర్శకత్వం కూడా చేసింది. తెలుగులో విడుదలైన దృశ్యం సినిమాను తమిళంలో శ్రీప్రియ డైరెక్ట్ చేసిందే. తొలుత తమిళంలో హిట్ కొట్టిన ఆమె,ఆతర్వాత తెలుగులో తీసి మంచి హిట్ అందుకుంది. ఆవిధంగా లతకు శ్రీప్రియ సొంత వదిన.