శోభన్ బాబుని దారుణంగా అవమానించిన టాలీవుడ్ తారలు… ఎక్కడో చూడండి
హీరోలకు,హీరోయిన్స్, నటులకు ఫాన్స్ ఉంటారు. ఇక అలనాటి నటుడు శోభన్ బాబు చనిపోయినప్పటికీ,ఆయనకి లక్షల్లో ఫాన్స్ ఉన్నారు. అలనాటి శోభన్ బాబు చిత్రాలు ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే ఎంతో ఎంజాయ్ చేస్తూ చూసే అభిమానులు, ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శోభన్ బాబు పేరిట ఓ కార్యక్రమం తలపెడితే ఈనాటి టాలీవుడ్ నటులు దారుణంగా అవమానించారు. హిట్స్ ఉన్నంతవరకే,బతికి ఉన్నంతవరకే అన్నట్లుగా ఉండే సినిమా ఫీల్డ్ లో హిట్స్ లేనివాళ్లపట్ల,పోయిన వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తారో వేరే చెప్పక్కర్లేదు. వారసుల హవా కొనసాగుతున్న నేపథ్యంలో వారసులు గానీ, స్టార్ డమ్ గల కుటుంబ సభ్యులు గానీ లేకపోతె పట్టించుకునే వారుండరని శోభన్ బాబు కార్యక్రమం ద్వారా మరోసారి తేటతెల్లం అయింది.
ఇంతకీ విషయం ఏమిటంటే శోభన్ బాబు ఫాన్స్ భారీ స్థాయిలో హైదరాబాద్ లో కొంతమంది తెలుగు తారలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. శోభన్ బాబు పేరిట ఇచ్చే ఈ అవార్డులకు రావాల్సిందిగా స్టార్స్ అందరికీ పేరుపేరునా ఇన్విటేషన్స్ ఇవ్వడమే కాదు,జీవిత సాఫల్య పురస్కార వేడుకను సెలవురోజైన క్రిస్మస్ నాడు ఏర్పాటుచేశారు.
భారీ ఏర్పాట్లు చేసారు. ఇక సెలబ్రిటీలు అందరూ వస్తారని సాధారణ జనం కూడా వచ్చారట. అయితే రెబెల్ స్టార్ కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్,నటుడు నరేష్ మినహా మిగిలినవారెవరూ రాలేదు. దీంతో చాలామంది నిరాశకు గురయ్యారు. గతంలో దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు చనిపోయినపుడు పెట్టిన సభకు కూడా ఇలానే స్టార్స్ ఎవరూ రాలేదు.
ఇప్పుడు శోభన్ బాబు పేరిట ఇచ్చే అవార్డుల ఫంక్షన్ కి కూడా అందరూ డుమ్మా కొట్టేసారు. ఫిలిం అవార్డులు, సైమా అవార్డ్స్ వంటి వేడుకలకు అవార్డులు రాకపోయినా సరే, సరదాగా స్టార్స్ అందరూ రావడం రివాజు. అయితే శోభన్ బాబు పేరిట ఇచ్చే అవార్డ్స్ ఫంక్షన్ కి ఎవరూ హాజరుకాకపోవడం పట్ల నిర్వాహకులు విచారం వ్యక్తంచేశారు. ఇక ఆ కార్యక్రమానికి వచ్చిన చాలామంది కూడా ఈ ప్రోగ్రాం కి టాలీవుడ్ ప్రముఖులు రాకపోవడం శోభన్ బాబుని దారుణంగా అవమానించడమేనని కామెంట్ చేసారు.