టాలీవుడ్ లో జగన్ కి జై కొడుతున్న వారు ఎంత మంది ఉన్నారో చూడండి
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇక 2019 రాజకేయ పార్టీలకు ఎంతో కీలకం. ఓపక్క లోక సభ, మరోపక్క అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో అధికార తెలుగుదేశం,ప్రతిపక్ష వైస్సార్ సిపి , మరోపక్క పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన హోరాహోరీగా తలపడనున్నాయి. ఎవరి రేంజ్ లో వాళ్ళు అప్పుడే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అధికార తెలుగుదేశం మళ్ళీ అధికారం నిలబెట్టుకోవాలని చూస్తుంటే, ఎలాగైనా గతంలో తప్పిన అధికారాన్ని ఇప్పుడు సొంతం చేసుకోవాలని వైస్సార్ సిపి ప్లాన్ వేస్తోంది. ఇక తామే ప్రత్యామ్నాయం అంటూ జనసేన వస్తోంది. అయితే జగన్ ఇప్పటికే పాదయాత్ర చేపట్టి దాదాపు అన్ని జిల్లాల్లో కవర్ చేస్తూ సాగుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. పాదయాత్రకు మంచి ఆదరణ వస్తోందని పార్టీ వర్గాలు సంతోషంగా ఉన్నాయి.
జనవరి 8నాటికి యాత్ర పూర్తవుతుందని అంటున్నారు. అది అయ్యాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని బస్సు యాత్ర చేయాలని జగన్ భావిస్తున్నారు. అయితే సినీ రంగంలో పలువురు సెలబ్రిటీలు జగన్ కి మద్దతు ఇస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి ,అక్కినేని కి మంచి అనుబంధం ఉండేది. ఇక జగన్ తో అక్కినేని సుమంత్ అనుబంధం కంటిన్యూ చేస్తుంటే , నాగార్జున కూడా జగన్ కి అండగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి మద్దతుగా నిలబడాలని భావిస్తున్నారట.
అందుకే బస్సు యాత్రకు నాగార్జున అన్నీ సమకూరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటి రోజా ఇప్పటికే జగన్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. నటుడు విజయ్ చందర్ కూడా జగన్ పార్టీలో ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ ఆదిశేష గిరిరావు వైస్సార్ సిపిలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
రచయిత, డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి ఇప్పటికే జగన్ కి మద్దతుగా టివి షోల్లో సైతం మాట్లాడుతున్నారు. కమెడియన్ పృథ్వి, స్టార్ కెమెరా మెన్ చోటా కె నాయుడు,హీరో కృష్ణుడు, సీనియర్ హీరో భానుచందర్ ,హీరో సుమంత్ తదితరులు జగన్ కి మద్దతిస్తున్నారు. ఇటీవలే పలువురు టాలీవుడ్ తారలు వైసిపి పక్షాన ఢిల్లీలో దీక్షలో పాల్గొన్నారు.