అమితాబ్ బచ్చన్ బాలయ్యని కాదని చిరంజీవితో చేయడానికి కారణం ఇదే

అమితాబ్ బచ్చన్ చిరంజీవితో కలిసి సైరా సినిమాలో నటిస్తున్నారు. అమితాబ్ తెలుగులో స్ట్రైట్ గా చేస్తున్న సినిమా ఇదే. కానీ ఒక సంవత్సరం క్రితం బాలకృష్ణ,కృష్ణ వంశీ కాంబినేషన్ లో ఒక సినిమా మొదలు అవుతుందని ప్రకటించారు. ఆ సినిమా పేరు రైతు అని ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటిస్తారని చెప్పారు. ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర చాలా కీలకమైనదని చెప్పారు. దానికి తగ్గట్టుగానే బాలయ్య,కృష్ణ వంశీ కూడా అమితాబ్ ని కలిశారు. పాత్రల గురించి చర్చలు కూడా కొనసాగాయి. ఏమైందో తెలియదు కానీ సినిమా ప్రారంభం కాలేదు. ఈ సినిమా గురించి కృష్ణ వంశీ మాట్లాడుతూ ఈ సినిమాకి అమితాబ్ ఒప్పుకుంటేనే చేస్తాం. లేదంటే చేయమని చెప్పారు.

ఎందుకంటే ఆ పాత్ర సినిమాలో చాలా కీలకం అని చెప్పారు. మరి అమితాబ్ ఎందుకు ఒకే చెప్పలేదనే సందేహం బాలయ్య అభిమానుల్లో అలానే ఉండిపోయింది. ఇక ఆ తర్వాత అమితాబ్ సైరా సినిమాలో చేస్తున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అయన నిజంగా చేస్తున్నారా అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. అయితే మొన్న అమితాబ్ షూటింగ్ లో పాల్గొని ఆ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఆ స్టిల్స్ చూసిన బాలయ్య అభిమానులు మా హీరోకి ఏమి తక్కువ మా హీరో సినిమాలో నటించటానికి నో చెప్పి చిరు సినిమాలో నటించటానికి ఎందుకు ఒప్పుకున్నారనే వాదనలు చేస్తున్నారు. ఈ విషయంపై కొంత క్లారిటీ రావాలంటే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన విషయం తెలుసుకోవాలి.

కొన్ని సంవత్సరాల జ్రిటం పూరి,అమితాబ్ కాంబినేషన్ లో బుడ్డా హోగయా తేరా బాప్ సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో చిరు కూడా పాల్గొన్నారు. అప్పుడు అమితాబ్ చిరును 149 వ సినిమాతో ఆపవద్దని ఇంకా సినిమాలు చేయాలని సూచించారు.

అంతేకాక చిరు 150 వ సినిమాకి పూరీని దర్శకుడిగా పెట్టుకోమని సూచించారు అమితాబ్. అప్పుడు అక్కడే ఉన్న పూరి ఆ సినిమాలో అమితాబ్ నటించాలని అడగమని చెప్పటంతో, చిరు అమితాబ్ ని అడిగితే అమితాబ్ ఒకే చెప్పారు.

అమితాబ్ అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు సైరా టీం సైరా లో నటించమని అమితాబ్ ని అడిగారు. దాంతో అమితాబ్ కూడా సైరాలో నటించటానికి ఒప్పుకున్నారు. అయితే బాలయ్య సినిమా రైతు ముందుకు వెళ్లకపోవటానికి మరొక కారణం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

కృష్ణ వంశీ రైతు సినిమాను అమితాబ్ ఉంటేనే చేస్తా లేకపోతే చేయను అని అనడం బాలయ్యకు నచ్చలేదట. బాలయ్య అమితాబ్ తనకు నో చెప్పి చిరంజీవికి ఒకే చెప్పటంతో కాస్త నిరాశ చెందాడట. అయినా చిరంజీవి అమితాబ్ ని కలిసినప్పుడల్లా ఆయన్ని ఆలింగనం చేసుకోవటమే పాదాభివందనం చేయటమే చేస్తూ ఉంటాడు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

error: Content is protected !!