Movies

చిరంజీవే ఆఖరి మెగాస్టార్, ఎవరేమనుకున్నా ఇదే నిజం

చిరంజీవి తర్వాత మెగాస్టార్ ఎవరు అనేది టాలీవుడ్ లో ఎప్పటి నుండో వేధిస్తున్న ప్రశ్న. అయితే కొంత మంది చిరు తర్వాత రామ్ చరణ్ అని, మరి కొంత మంది అల్లు అర్జున్ అని, మహేష్ బాబు అని,ఎన్టీఆర్ అని, బాహుబలి తర్వాత ప్రభాస్ మెగాస్టార్ అని ఇలా టాలీవుడ్ టాప్ హీరోల పేర్లు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో స్టార్ నాని పేరు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఏ హీరోకి రాని హిట్స్ వచ్చాయి. డబుల్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నాడు నాని. ఈ నేచురల్ స్టార్ చిరు తర్వాత మెగాస్టార్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
నిజంగానే నానికి మెగాస్టార్ అయ్యే సీన్ ఉందా? అసలు శివ శంకర వరప్రసాద్ నుంచి మెగాస్టార్ గా చిరంజీవి ఎలా మారాడు? దాని వెనక ఎవరు ఉన్నారంటే కేవలం స్వయంకృషి మాత్రమే ఉందని చెప్పాలి.

చిరంజీవి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్,ఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి టాప్ హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇలాంటి సూపర్ స్టార్స్ మధ్య చిరంజీవి పైకి రావటం అంటే మాములు విషయం కాదు.

చిరంజీవి సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు సినీ పరిశ్రమ మూస ధోరణిలో ప్రయాణం చేస్తుంది. అప్పుడే చిరు తనలో ఉన్న ప్రత్యేకతలు అయినా డాన్స్,ఫైట్స్ మీద దృష్టి పెట్టాడు. డాన్స్ లో ఒక స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే చిరు డాన్స్ ల కోసమే సినిమాలకు వెళ్లేవారంటే చిరు డాన్స్ లు ఏ రేంజ్ లో ఉండేయో అర్ధం చేసుకోవచ్చు.

చిరంజీవి సినిమా చూస్తూ చిరు డాన్స్ కి ఆడియన్స్ స్టెప్ లు వేయటం చిరు సినిమాలతోనే మొదలు అయింది. ఫైట్స్ విషయంలో కూడా చిరు డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేసేవాడు. సినిమాల్లోకి బ్రేక్ డాన్స్ లను తీసుకువచ్చి సుప్రీం హీరోగా ఎదిగాడు చిరంజీవి.

చిరంజీవి కథ బలం లేకున్నా డాన్స్,ఫైట్స్,నటనతో ఎన్నో సినిమాలను చేసి హిట్స్ కొట్టాడు. అలాగే చిరు డ్రెస్సింగ్ స్టైల్,హెయిర్ స్టైల్ కి ఫిదా అయ్యిపోయారు. మహేష్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి అని… ఆ తర్వాత ఎవరు ఉండరని అన్నాడు.