Movies

ఎన్టీఆర్ వాచ్ ధర తెలిస్తే మతిపోతుంది

సెలబ్రిటీలు ధరించే డ్రెస్ లు,వాడే కార్లు , ఇతర లగ్జరీ గూడ్స్ చూస్తే వామ్మో ఇంత రేటా అని అందరూ నోరు వెళ్ళబెట్టాల్సిందే. అధునాతన సౌకర్యాలతో ఇళ్ళు, షూటింగ్స్ స్పాట్ లో సయితం ఇంటిని మరపించే అధునాతన సౌకర్యాలతో బస్సు వాడటం అన్నీ చూస్తున్నాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే కార్లు,వాచీలు ఖరీదైనవి వాడుతున్నాడు. ఇక తాజాగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి సందర్బంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ పలువురు సెలబ్రిటీలు రాజస్థాన్ లోని జైపూర్ కి తరలివెళ్లారు.

ఇక టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డిఫరెంట్ హీరో రానా,నేచురల్ స్టార్ నాని కల్సి జైపూర్ ఎయిర్ పోర్టు లో దిగి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ టీ షర్ట్,జీన్స్ లో కళ్ళకు అద్దాలు పెట్టుకుని చాలా కాజువల్ గా కనిపించాడు. అయితే చేతికి పెట్టుకున్న రిస్ట్ వాచ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఇది ఆలాంటి ఇలాంటి వాచ్ కాదు. దీనికి ఎన్నో స్పెషాలిటీలు ఉన్నాయి. రిచర్డ్ మిల్లే మెక్‌లారెన్ కంపెనీకి చెందిన ఈ వాచ్‌ కి టైటానియంతో తయారుచేసిన డయల్ ఉంటుంది. స్ట్రాప్ రబ్బర్‌తోను, వాచ్‌ కేస్‌ను కార్బన్ టీపీటీ మిశ్రమంతో రూపొందించారు. వివిధ దేశాల కాలాన్ని ఈ వాచ్‌లో ఒకేసారి చూడొచ్చు.

దీని ధర ఒకటిన్నర కోట్ల నుంచి రెండున్నర కోట్ల వరకూ ఉంటుందట. అయ్యా బాబోయ్ రెండు కోట్లు వాచ్ అని ఆశ్చర్య పోవచ్చు కానీ,సెలబ్రిటీలకు ఇది షరా మామూలే. ఎందుకంటే ఇలాంటి లగ్జరీ వాచ్ తో రామ్ చరణ్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. అదికూడా మామూలిది కాదు. ఫిలిప్ నాటిలస్ బ్రాండ్ వారి రోజ్ కోల్డ్ వాచ్ అది. దాని రేటు 80లక్షల నుంచి ఒకటిన్నర కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందట. అలా అప్పుడు చెర్రీ ఈ వాచ్ తో అందరిని ఆకర్షిస్తే, ఇపుడు తారక్ మరింత ఖరీదైన వాచ్ ధరించి స్టార్ హీరోలంటే ఇలానే ఉంటారు అని నిరూపించారు.