మగధీర కథ రాసుకున్నది చరణ్ కోసం కాదు….మెగాస్టార్ కోసం…?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అసలు మగధీర కథను చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని రాశారట విజయేంద్ర ప్రసాద్. చిరంజీవితో సినిమా తీయాలని అనుకున్నారట. తెలుగులో ప్రతి దర్శకుడు చిరంజీవితో సినిమా తీయాలని అనుకుంటారు. అలాగే రాజమౌళి కూడా చిరుతో సినిమా తీయాలని అనుకున్నాడు.

ఆలా అనుకున్న కొన్ని రోజులకు చిరంజీవి దగ్గర నుంచి తమకు పిలుపు వచ్చిందని, తనతో సినిమా తీయమని చెప్పారట. ఆలా చెప్పటం అయన గొప్పతనమే అని అన్నారు విజయేంద్ర ప్రసాద్.

అప్పుడు కథ లైన్ మరియు వంద మంది ఫైటర్స్ సంబంధించి ఎపిసోడ్ ఆయనకు వినిపించాం. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను ఆయనతో తీయలేకపోయాం. ఆ కథను వేరే హీరోతో చేయనని రాజమౌళి చెప్పాడు.

రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు ఆ కథనే మగధీర సినిమాగా చేశామని, మెగా వారసత్వం కారణంగానే చరణ్ అద్భుతంగా నటించాడని చెప్పారు విజయేంద్ర ప్రసాద్.