Devotional

2019 సింహ రాశి బలాబలాలు అవమానం రాజపూజ్యం ఏది ఎక్కువో చూద్దాం హెడ్ లైన్స్

మఖ 1,2,3,4 పాదాలు,పుబ్బ 1,2,3,4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందినవారు. వీరికి 2019 వ సంవత్సరంలో వీరికి ఆదాయము 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6 ఉంటుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. విద్యార్థులకు శుభ కాలమనే చెప్పాలి. అయితే కొంత అలసత్వం,అశ్రద్ధ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు తీరతాయి. అతి ఆత్మవిశ్వాసం ఉండకూడదు. అనువు కానీ చోట నిదానంగా ఉండాలి. సంబంధం లేని విషయాలలో కల్పించుకుంటే సమస్యల్లో పడతారు. వాహనాలు నడిపినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

జీవిత భాగస్వామితో సర్దుకుపోయే తత్త్వం ఉంటే మంచిది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ద చూపాలి. గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. కొత్త పరిచయాలు కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించాలి. మానసిక ప్రశాంతత లోపించవచ్చు. విలాసాల కోసం కొంచెం ఖర్చు పెట్టె అవకాశం ఉంది. ఆస్తులు, భవనాలు మొదలైన వాటిని వృద్ధి చేసుకోవాలని ఆరాటము ఎక్కువౌతుంది. తాము అనుకున్నది సాధించటానికి ఏమి చేయటానికి అయినా సిద్ధంగా ఉంటారు.

అలాంటి సమయంలో కాస్త వక్ర మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాన్ని స్వంతంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార భాగస్వాములను దూరంగా ఉంచాలని ప్రయత్నాలు చేస్తారు. రాజకీయ పరపతి ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతాయి. మీకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుంటారు. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.

భాగస్వామితో గతంలో ఉన్న అపోహలు,అపార్ధాలు అన్ని తొలగిపోతాయి. వ్యాపారంలో అనేక రకాలైన క్రొత్త మార్గాలను అన్వేషించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు. నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు. సమాజంలో ముఖ్యమైన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నత స్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు.

అదనపు, బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. ఈ సంవత్సరం అనేక స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలకై అన్వేషణ ప్రారంభిస్తారు. సమయం కోసం నిరీక్షిస్తారు. మీ కలలు అన్ని నెరవేరుతాయి.

జీవితాశయము నెరవేరే అవకాశాలు అతి చెరువలో ఉన్నాయని గ్రహించండి. మిమ్ములను ద్వేషించిన వారు మీ స్నేహానికై ఆరాటపడతారు. అదే విధంగా మీ స్నేహాన్ని కోరే వారు కూడా ఆరాటపడుతుంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భవిష్యత్‌ జీవితానికి గుణపాఠమి గుర్తించండి. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది.

జీవితంలో ధనము, హోద, విలాసాలు మాత్రమే ప్రధానము కాదని గ్రహిస్తారు ఆరోగ్య పరిస్థితి గతంలో కన్న మెరుగ్గా ఉంటుంది. ఈ రాశివారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలి. పేద విద్యార్థులకు చేయూతను ఇవ్వాలి. గోసేవ చేయాలి. గోవుకి నల్లనువ్వులు, శనగలు, నల్ల మినుములు ఆహారంగా పెట్టాలి.