హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అవుతున్న అంతఃపురం చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా ఉన్నాడో చూడండి
సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు లేకుండా ఉండే సినిమాలు చాలా తక్కువే. ఎక్కడో అక్కడ చైల్డ్ ఆర్టిస్టు అవసరం ఉంటుంది. బయట వాళ్ళని కంటే ఇండస్ట్రీలోని పిల్లలనే ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్టులుగా ఈమధ్య చూపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి విధానం ఉన్నా, అప్పట్లో బయట వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండేది. ఇక కృష్ణ వంశీ తీసిన సెన్షేనల్ హిట్ మూవీ అంతఃపురం అప్పటిలో ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన తొలిసినిమా అని చెప్పవచ్చు. సౌందర్య, సాయికుమార్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఓ విదేశీ మూలం నుంచి తీసుకున్నాడట.
నాట్ విత్ మై డాటర్ అనే అమెరికన్ మూవీని ఆధారం చేసుకుని తెలుగులో మూవీ తీయాలని మొదట్లో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి భావించి, కథా చర్చలు చేస్తున్నాడట.
అయితే అదే సమయంలో కృష్ణవంశీ కి కూడా ఈ సబ్జెక్ట్ నచ్చడంతో మీరే తీయండి అని ఎస్వీ కృష్ణారెడ్డికి వదిలేసాడు. దీంతో ఈ సబ్జెక్ట్ టేకప్ చేసిన కృష్ణవంశీ అద్భుతంగా తీసాడు. ఆవిధంగా ఈ సినిమా కృష్ణవంశీ ఖాతాలో పడిపోయింది. ఇక 1999లో తమిళంలో రీమేక్ చేయగా అక్కడా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.
రెండు భాషల్లోనూ ఈ మూవీకి అవార్డుల పంట పండింది. సౌందర్యకు సౌత్ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు వస్తే,ప్రకాష్ రాజ్ కి నేషనల్ ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. ప్రకాష్ రాజ్,సౌందర్య,సాయికుమార్ పాత్రలను తమిళంలోనూ చేయించారు. అయితే జగపతి బాబు రోల్ ని పార్టీవన్ నటించాడు.
ఈ మూవీలో జానకికి బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా అవార్డు రాగా, జగపతిబాబుకి, పార్టీవన్ కి కూడా నంది అవార్డులు దక్కాయి. సౌందర్య కు డబ్బింగ్ చెప్పినందుకు బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవార్డుని సరిత అందుకుంది.
అయితే ఈ మూవీలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఉంటుంది. అది సినిమాకి కీలకం. సౌందర్య,సాయికుమార్ ల కొడుకుగా నటించిన మాస్టర్ కృష్ణ ప్రదీప్ వయస్సు అప్పట్లో రెండేళ్లు. ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకోవడమే కాకుండా సౌందర్య స్పృహ తప్పి పడిపోతే,కర్చీఫ్ తో తుడిచే సీన్ లో కృష్ణ ప్రదీప్ నటన చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టారు. అందుకే అతడి నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కొట్టేసాడు.
అయితే మళ్ళీ ఏ మూవీలోనూ అతడు కనిపించలేదు. అయితే ఇప్పుడు హీరో అవ్వాలని ట్రై చేస్తున్నాడు. తన నట గురువు కృష్ణ వంశీ అని చెప్పే కృష్ణ ప్రదీప్ చాలా హ్యాండ్సమ్ గానే ఉన్నాడు. అతడి వయస్సు ఇప్పుడు 22సంవత్సరాలు. మరి ఎలా ఎంట్రీ ఇస్తాడో చూడాలి.