Movies

షారుఖ్ ఖాన్ ఇంటి విలువ తెలిస్తే షాకవుతారు

సెలబ్రిటీలు ఏం చేసినా సంచలనమే. డ్రెస్ ల దగ్గర నుంచి అన్నీ కాస్ట్లీ వ్యవహారంగానే ఉంటాయి. ఇక ఇంటి విషయంలో చాలా కేర్ తీసుకుని అత్యాధునిక వసతులతో నిర్మాణం చేసుకుంటున్నారు. ఒకప్పుడు చిన్న చిన్న ఇళ్లల్లో సర్దుకుని కాలక్షేపం చేసినా, స్టార్ హోదా వచ్చాక విలాసవంతమైన భవనాల్లోకి వెళుతున్నారు. ఇక బాలీవుడ్ లో బాద్ షా గా పిల్చుకునే షారుఖ్ ఖాన్ అత్యంత విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. అతిపెద్ద ధనవంతుల జాబితాలో గల షారుఖ్ ముంబయి సముద్ర తీరంలో ఇష్టంగా ఓ బంగ్లా కొన్నాడు. ఈ బంగ్లా తీసుకోవడం వెనుక అతడి అత్తగారు కారణమని షారుఖ్ చెబుతాడు.

ఇక తాజాగా షారుఖ్ నటించిన మూవీ జీరో మూవీ ఇటీవల విడుదలైంది. ఆనందల్ రాయ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కత్రినా కైఫ్,అనుష్క శర్మ నటించారు. ఈ మూవీ ప్రమోషన్ సందర్బంగా మాట్లాడుతూ కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు.’సినిమా ఇండస్ట్రీలో స్థిరపడడానికి ఢిల్లీ నుంచి ముంబయి వచ్చాను. అప్పటికే పెళ్లయిన నేను చిన్న అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో నివసించేవాడిని. ఢిల్లీ అపార్ట్ మెంట్ కల్చర్ అప్పట్లో తక్కువ. ఢిల్లీ వాసులు డబ్బులు లేకున్నా కనీసం ఓ చిన్న ఇంటిని కొనుక్కోడానికి ఇష్టపడేవారు.

ఇక నేను ఉండే చిన్న అపార్ట్ మెంట్ చూసిన మా అత్తగారు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నారా అని పదేపదే అనేవారు. దాంతో అత్తగారికి నచ్చేవిధంగా భారీ బంగ్లా కొనాలని నిర్ణయించుకున్నాను’ అని వివరించాడు. అలా కొన్న ప్రస్తుత బంగ్లా విలువ నా ఆస్తుల్లో కెల్లా అత్యంత విలువైనది. దీనివిలువు దాదాపు 200కోట్లు ఉంటుందని షారుఖ్ చెప్పాడు. దీనికన్నా విలువైనది తనకు మరొకటి లేదని,ఆవిధంగా ఇది అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పు కొచ్చాడు.

ఈ మన్నత్ బంగ్లా ను గతంలో విల్లా వియన్నా అని పిలిచేవారట. ఈ బంగ్లాకు మొదట్లో యజమానిగా ఉండే గుజరాత్ కి చెందిన కేకు గాంధీ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 13కోట్లకుషారుఖ్ కి అమ్మేశాడు. ఆవిధంగా వచ్చిన బంగ్లా విలువ ఇప్పుడు వందల కోట్లు దాటేసింది.